Watch Video: జాతర ముగిసిన మేడారంలో ఇవేం పూజలు.. పూజారి మరణంతో విషాద ఛాయలు..
సమ్మక్క పూజారి మరణంతో విషాద వాతావరణంలో ఉన్న మేడారంలో తిరుగువారం పండుగ ఆదివాసి ఆచార సాంప్రాయాల ప్రకారం నిర్వహించారు. ఆదివాసీ ఆడపడుచులంతా సమ్మక్క పూజామందిరంలో పూజలు నిర్వహించారు. తిరుగువారం పండుగ అనంతరం ఆదివారం నిర్వహించే వనబోజనాలతో జాతర పరిసమాప్తమైనట్టు గిరిజన పూజారులు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ముగిసింది. ఈనెల 21 నుండి 24 వరకు జరిగిన జాతర మహా వైభవంగ సాగింది. ఈ సారి జాతరలో సరికొత్త రికార్డ్లు నమోదయ్యాయి.

జాతర ఆరంభంలోని మొదటివారం గుడిమెలిగ పండుగతో గుడిశుద్ది కార్యక్రమాలు చేసి జాతరకు అంకురార్పణ చేశారు. మరుసటి వారం మండమెలిగ పండుగతో సమ్మక్క గుడిలోని పూజా సామాగ్రిని శుద్ధిచేసి రహస్య పూజలు నిర్వహించడంతో నాటి నుండి వనదేవతలకు మొక్కలు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు. మండమెలిగే పండుగ మరుసటి వారం వనదేవతలు గద్దెలపై కొలువుదీరి నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర జరిగింది. ఈ సారి జాతరకు రికార్డు స్థాయిలో కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారు.
సమ్మక్క సారలమ్మ దేవతల వన ప్రవేశం ముగిసింది. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తిరుగువారం పండగ నిర్వహించారు. ఆదివాసి పూజార్లు ఇంటి ఆడపడుచులతో కలిసి ఈ పండుగ నిర్వహించారు. ముందుగా సమ్మక్క పూజా మందిరాన్ని శుద్ధిచేసి ఆడపడుచులు ముగ్గులతో అలంకరించారు. సాంప్రదాయబద్దంగా సమ్మక్క పూజా సామాగ్రిని గిరిజన పూజారులు గుడిలో భద్రపరిచారు. దీంతో వనదేవతల జాతర ముగిసింది. అనంతరం ఆదివారం ఈ గిరిజనులంతా వనదేవతలకు మొక్కుకున్న కోళ్లు, మేకలతో కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెలతారు. ఈ తంతుతో మేడారం మహా జాతర పరిసమాప్తమైనట్లు సమ్మక్క ప్రధాన పూజారులు తెలిపారు. ఐతే మంగళవారం సమ్మక్క పూజారి ఆనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యం మేడారంలో విషాదచాయాలు అలముకున్నాయి. బాధాతప్త హృదయంతో తిరుగువారం తంతు నిర్వించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..