Bill Gates: హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. ఐటీనుద్దేశించి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ అంటే మెట్రో సిటీ మాత్రమే కాదు.. ఐటీకి అడ్డా కూడా. అందుకే ప్రముఖ కంపెనీలు సైతం హైదరాబాద్ లో తమ సంస్థలను నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. భారీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అనువుగా ఉండటంతో ఇక్కడి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్ కు వచ్చారు.
హైదరాబాద్ అంటే మెట్రో సిటీ మాత్రమే కాదు.. ఐటీకి అడ్డా కూడా. అందుకే ప్రముఖ కంపెనీలు సైతం హైదరాబాద్ లో తమ సంస్థలను నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. భారీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అనువుగా ఉండటంతో ఇక్కడి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్ కు వచ్చారు. బుధవారం హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ)ను సందర్శించారు. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించడంలో ఐడీసీ కీలకంగా వ్యవహరిస్తోంది. మైక్రోసాఫ్ట్ ఐడీసీ, ఎక్స్ పీరియన్స్ ప్లస్ డివైజెస్ ఇండియా సీవీపీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మా అతిపెద్ద ఆస్తి అయిన ఐడీసీలో బిల్ గేట్స్ భారతదేశపు ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మేధావులను ఉద్దేశించి ప్రసంగించడం చాలా సంతోషంగా ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భారతదేశానికి అవకాశాలపై మాట్లాడుతూ.. ఇండియా నుంచి క్రిటియేవిటిని బయటకు తీయడానికి ఐడిసి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందన్నారు. కృత్రిమ మేధ, క్లౌడ్ నుండి భద్రత, గేమింగ్ వరకు పట్టు సాధిస్తున్నామని ఆయన అన్నారు. ఈ వారం ప్రారంభంలో, గేట్స్ లింక్డ్ఇన్ పోస్ట్ లో భారతదేశాన్ని సందర్శించే తన ప్రణాళికలను ప్రకటించారు. “బిలియన్ల మంది జీవితాలను మెరుగుపరచడానికి ఆరోగ్యం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ఎలా వినూత్నమైన కొత్త మార్గాలను కనుగొంటుందో తెలుసుకోవడానికి నేను వేచి ఉండలేను” అని అన్నారు.
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు తన బ్లాగ్ లో రియాక్ట్ అవుతూ ఇండియా ఆలోచనలు, ఆవిష్కరణలు అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరడంలో సహాయపడటానికి, మేం ఎలా పనిచేయవచ్చో తెలుసుకోవడానికి వచ్చినట్టు” పేర్కొన్నారు. ఈ వారంలో తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఇదే ప్రధాన అంశమని బిల్ గేట్స్ తెలిపారు.