AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఫిక్స్.. దానికి ముందే ఎంపీ అభ్యర్థుల ప్రకటన..? ప్లాన్ అదేనా..

PM Modi Hyderabad Visit: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది.. 17 సీట్లలో దాదాపు 10కి పైగా సీట్లే టార్గెట్‌గా ముందుగు దూసుకెళ్తోందిన. ఇప్పటికే9.. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన భారతీయ జనతా పార్టీ.. ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రధాని సహా అగ్రనేతల పర్యటనతో ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది.

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఫిక్స్.. దానికి ముందే ఎంపీ అభ్యర్థుల ప్రకటన..? ప్లాన్ అదేనా..
Pm Modi
Vidyasagar Gunti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 28, 2024 | 3:04 PM

Share

PM Modi Hyderabad Visit: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది.. 17 సీట్లలో దాదాపు 10కి పైగా సీట్లే టార్గెట్‌గా ముందుగు దూసుకెళ్తోందిన. ఇప్పటికే9.. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన భారతీయ జనతా పార్టీ.. ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రధాని సహా అగ్రనేతల పర్యటనతో ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. 4న ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమాల్లో, 5న సంగారెడ్డి జిల్లా ప్రొగ్రామ్స్ లలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారు. మార్చి 4న ఉదయం ప్రధాని మోడీ నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ నుంచి 9.20 కి హెలికాఫ్టర్ లో బయలుదేరుతారు. 10.20కి ఆదిలాబాద్ చేరుకొని.. 11 గంటల వరకు పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 11.15 నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్‌లో జరిగి బిజెపి భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. తర్వాత ఆదిలాబాద్ నుంచి నాందేడ్ మీదుగా తమిళనాడు బయలుదేరి వేళ్తారు. తమిళనాడులో కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి 7.45 కి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి రాజ్ భవన్ లోనే ప్రధాని బస చేయనున్నారు.

ఆ తర్వాత మార్చి 5న ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగం పేట్ ఎయిర్ పోర్టు నుంచి సంగారెడ్డి బయలుదేరి వేళ్తారు. 10.45 నుంచి 11:15 వరకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత సంగారెడ్డిలో బిజెపి భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఆ సభ తర్వాత తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఒడిశా బయలుదేరి వెళ్తారు. విజయ సంకల్ప యాత్రలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించిన బిజెపి.. ప్రధాని మోడీ రాకతో దాన్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. మోడీ పర్యటనలకు ఇప్పటికే భారీ ఏర్పాట్ల దిశగా పార్టీ వెళ్తోంది. మరోవైపు ప్రధాని మోడీ ఎలాంటి సందేశం ఇస్తారు.. తెలంగాణకు ఏం ప్రకటిస్తారన్న చర్చ మొదలైంది.

ఇదిలాఉంటే.. పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే.. సిట్టింగ్ స్థానాలతోపాటు.. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..