TSRTC: ఇంటర్ విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాళ్లకూ ఉచిత ప్రయాణం
ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు బుధవారం ప్రారంభం కావడంతో రూట్ బస్ పాస్ ఉంటే పురుష విద్యార్థులకు వన్ వే ఉచిత ప్రయాణానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) అనుమతించింది. బస్ పాస్ ఉన్న విద్యార్థినులు హాల్ టికెట్ చూపించి ఈ సదుపాయాన్ని పొందాలని టీఎస్ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ హాల్ టికెట్, రూట్ బస్ పాస్ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు బుధవారం ప్రారంభం కావడంతో రూట్ బస్ పాస్ ఉంటే పురుష విద్యార్థులకు వన్ వే ఉచిత ప్రయాణానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) అనుమతించింది. బస్ పాస్ ఉన్న విద్యార్థినులు హాల్ టికెట్ చూపించి ఈ సదుపాయాన్ని పొందాలని టీఎస్ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ హాల్ టికెట్, రూట్ బస్ పాస్ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వారి ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు మాత్రమే. ఒకవేళ మగ విద్యార్థికి రాయితీ బస్ పాస్ లేకపోతే వారి ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
పురుష విద్యార్థులకు ఏదైనా తేదీ/ తేదీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే లేదా సాధారణ సెలవుదినం లేదా ఆదివారం ప్రకటించినప్పటికీ పై ఉచిత సదుపాయం చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఇక మహిళా విద్యార్థుల విషయానికొస్తే మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్లు జారీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు 9959226160 , 9959226154 నెంబర్లతో పాటు ఆయా బస్ స్టేషన్ లో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో 4,78,718 మంది విద్యార్ధులు, రెండో సంవత్సరంలో 5,02,260 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.