AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Byelections: జోరుమీదున్న ఉపఎన్నిక పోరు.. మంత్రి హరీష్ రావు వీడియో మార్ఫింగ్ చేశారంటూ..

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసినప్పటికీ.. పొలిటికల్ హీట్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మైక్‌లకు తాళం పడినా..

Huzurabad Byelections: జోరుమీదున్న ఉపఎన్నిక పోరు.. మంత్రి హరీష్ రావు వీడియో మార్ఫింగ్ చేశారంటూ..
Huzurabad Elections
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 29, 2021 | 4:42 PM

Share

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసినప్పటికీ.. పొలిటికల్ హీట్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మైక్‌లకు తాళం పడినా.. నేతల నోళ్లకు తాళాలు పడలేదు. దాంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోతున్నారు. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హుజురాబాద్ ఎన్నికల్లో కొన్ని వీడియోస్‌ను మార్ఫింగ్ చేసి తమ పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బుద్ధ భవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, గట్టు రామచంద్రరావు. మంత్రి హరీష్ రావుకు సంబంధించిన వీడియోను ఓ మీడియా ఛానల్ మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కంప్లైంట్‌లో వివరించారు. ఆ వీడియోను వెంటనే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ నాయకులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరించి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అంతేకాదు.. చత్తీస్‌గఢ్‌ కు చెందిన వందలాది సిమ్ కార్డులు తీసుకువచ్చి వాటి ద్వారా డబ్బులు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు.

మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయంటూ ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీపీసీసీ నేతలు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్‌లో జరిగేవి ఎన్నికలు కాదని, రాజకీయ వ్యాపారం వ్యభిచారం అంటూ మండిపడ్డారు. తెలంగాణ సమాజం మొత్తం మద్యం మత్తులో ఊగేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ శశాంక్ గోయల్‌ని సస్పెండ్ చేసి కొత్త ఎన్నికల అధికారిని పంపాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పక్కకు వదిలేసి హుజురాబాద్‌లో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు వివరించారు.

మరోవైపు బుద్ధ భవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్.. హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు 90 కోట్ల రూపాయల డబ్బు పంపిణీ చేశారన్నారు.

Also read:

Samyuktha Menon: సొగసుల సాగరంలో మత్స్యకన్య ఈ మలయాళీ సోయగం.. సంయుక్త మీనన్

IRCTC: ఐఆర్‌సీటీసీ ఆదాయాలపై కేంద్రం ఫోకస్.. 50:50 ప్రాతిపదికన కన్వీనియన్స్ ఇవ్వాలన్న రైల్వే శాఖ..

Superstar Rajinikanth: ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణమదేనంటున్న సన్నిహితులు..