AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ శివారుల్లో కంత్రీగాళ్లు.. అర్థరాత్రి వేళ అకస్మాత్తుగా వస్తారు.. ఆపై ఏం చేస్తారంటే..

Hyderabad: రాత్రి వేళల్లో ఒంటరిగా వెళుతున్న వాహనదారులను టార్గెట్ చేసి, వారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తూ దోపిడీలకు

Hyderabad: హైదరాబాద్ శివారుల్లో కంత్రీగాళ్లు.. అర్థరాత్రి వేళ అకస్మాత్తుగా వస్తారు.. ఆపై ఏం చేస్తారంటే..
Arrest
Shiva Prajapati
|

Updated on: Oct 28, 2021 | 9:26 PM

Share

Hyderabad: రాత్రి వేళల్లో ఒంటరిగా వెళుతున్న వాహనదారులను టార్గెట్ చేసి, వారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి, చేవెళ్ల, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్న ఆగంతకులతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి చోరీకి గురైన వస్తువుల తోపాటు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు నిందితులు ఉపయోగిస్తున్న ఇనుప రాడ్స్, ఎయిర్ పిస్టల్, కత్తి లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ డిసిపి ఎన్. ప్రకాష్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహమ్మద్ హర్షద్ ఖాన్ అలియాస్ రషీద్ ఈ దొంగల ముఠాకు నాయకుడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన హర్షద్ శంకర్ పల్లిలో నివాసముంటూ కార్పెంటర్ పని చేస్తుంటాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కి చెందిన జావేద్ చవాన్, షారూక్, మహమ్మద్ అఫ్జల్, అక్మల్ చవాన్, మహమ్మద్ ఫైజాన్ లు బ్రతుకు తెరువుకై పని కోసం బెంగళూరుకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ఎలాంటి పని దొరకకపోవడంతో హర్షద్ ఖాన్ ను సంప్రదించారు. హర్షద్ ఖాన్ వారిని శంకర్‌‌ పల్లి కి పిలిపించుకొని తనతోపాటే ఉంచుకున్నాడు. విలాసవంతమైన జీవితం కోసం పని చేస్తే డబ్బులు రావని దొంగతనాలు చేయడంవల్ల తేలికగా డబ్బులు సంపాదించడం అంటూ వారికి సూచించాడు. దీంతో వారు సరే అనడం తో ఓ పథకం రూపొందించుకున్నారు.

ఈ మేరకు ముందుగా ఇనుప రాడ్లు, కత్తి, ఎయిర్ పిస్టల్ సమకూర్చుకొని ఓ కారును అద్దెకు తీసుకున్నారు. పథకంలో భాగంగా శంకరపల్లి ప్రధాన రహదారిపై మకాం వేసి ఒంటరిగా వెళుతున్న వాహనదారులను ఆపి దారి కోసం వివరాలు అడుగుతారు. వాహనదారుడు సమాధానం చెప్పే లోగా అదే సమయమని భావించి కార్ లో ఉన్న మిగతావారు కిందికి దిగి వాహనదారులపై దాడికి పాల్పడుతుంటారు. వారిని బెదిరించి అతని వద్ద ఉన్నది దోచుకుంటారు. శంకర్ పల్లి, చేవెళ్ల, సంగారెడ్డి ప్రాంతాలలో ప్రధాన రహదారులపై ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకోవడంతో సైబరాబాద్ కమిషనర్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శంకర్ పల్లి పోలీసులు, ఎస్ ఓ టి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి దోచుకున్న సొమ్ము తో పాటు వాహనదారులపై దాడికి ప్రయత్నించిన ఇనుప రాడ్లు, కత్తి, ఎయిర్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దోపిడీలకు పాల్పడేందుకు ఉపయోగించిన కార్లను సైతం సీజ్ చేసినట్లు డిసిపి ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిందితుల పై పి.డి యాక్ట్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Also read:

Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..

Bheemla Nayak: భీమ్లా నాయక్ ఆప్డేట్.. డానియల్ శేఖర్‌కు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ..