Hyderabad : అన్నం పెట్టిన ఇంటికి కన్నం పెట్టాడో కేటుగాడు.. అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad : అన్నం పెట్టిన ఇంటికి కన్నం పెట్టాడో కేటుగాడు. ఇంటికి కాపాలా ఉండాల్సిన వాచ్ మెన్ ఇంటినే గుల్లచేసిన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో
Hyderabad : అన్నం పెట్టిన ఇంటికి కన్నం పెట్టాడో కేటుగాడు. ఇంటికి కాపాలా ఉండాల్సిన వాచ్ మెన్ ఇంటినే గుల్లచేసిన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటికి కాపాలా ఉంటాడని నమ్మి ఇల్లు అప్పజెప్తే అ ఇంటినే గుల్ల చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ చోరీకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధి బండ్లగుడా శ్రీరాంనగర్ సమీపంలోని సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న ఇంద్ర అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు నెల రోజుల క్రితం కంటి సమస్యతో బాధడుతు వైద్యం కోసం సోంత ఊరు అనంతపురం వెళ్లింది. అయితే ఊరు వెళ్ళే ముందు వాచ్ మెన్ కిరణ్ కుమార్‌తో చెప్పి వెళ్లింది. ఇక కంటి ఆపరేషన్ పూర్తిచేసుకుని ఈ నెల 27 లో తేదీన తిరిగి వచ్చారు ఇంద్ర. ఇంటికి వచ్చిన ఆమెకు డోర్ కు వేసిన తాళానికి బదులు మరో తాళం కనిపించింది.
తాళం విరగ్గొట్టి లోనికి వెళ్ళగానే రెండు అలమార తాళాలు తీసి ఉన్నాయి. అందులోని బంగారు చైన్, మూడు బంగారం ఉంగరాలు, నాలుగు వెండి కుంకుమ భరణీలు, రెండు ద్వీపాలు, 1,30,000 రూపాయలు కనిపించలేదు. దాంతో బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. అనుమానితుడైన వాచ్ మెన్ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో నిజం ఒప్పుకున్నాడు. అతని వద్ధ నుంచి 2.2 తులాల బంగారం 81,000/- నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు.
Also read:
Aloe Vera: వీళ్లు కలబందను తీసుకోవడం చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసుకోండి..
Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today: గుడ్‌న్యూస్.. దేశీయంగా మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో..