Huzurabad Bypoll: మావోయిస్టులు చెప్పిన ఆ మాట నిజమే.. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్..
Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకులు అధికార టిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని శ్రావణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో జరిగేవి ఎన్నికలు కాదని, రాజకీయ వ్యాపారం వ్యభిచారం అంటూ పరుష కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎక్కడా ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, అరాజ్ (వేలం) పాడి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు ఇద్దరూ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ సమాజాన్ని మొత్తం మద్యం మత్తులో ఊగేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎన్నికలు మొత్తం రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ శశాంక్ గోయల్‌ని సస్పెండ్ చేస్తూ కొత్త ఎన్నికల అధికారిని పంపాలంటూ విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నక్సలైట్లు నాడు చెప్పింది నిజమేననిపిస్తోందన్నారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని అంటూ నక్సలైట్లు అప్పట్లో అనేవారని, ఇప్పుడు జరుగుతున్నవి పూర్తిగా బూటకపు ఎన్నికలే అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పక్కన వదిలేసి హుజరాబాద్‌లో మూడు వేల కోట్లను ఖర్చు పెట్టారంటూ ప్రభుత్వం తీరుపై శ్రావణ్ ఫైర్ అయ్యారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని, ఎంక్వైరీకి అధికారులను పంపిస్తామని హామీ ఇచ్చిందని శ్రావణ తెలిపారు.
Also read:
Personal Loans: పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి..