Andhra Pradesh Politics: హీటెక్కుతున్న ఏపీ రాజకీయం.. ఢీల్లీలో వైసీపీ, టీడీపీ నేతల పోటాపోటీ ఫిర్యాదులు..
Andhra Pradesh Politics: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరణరంగంగా మారుతోంది. రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడినా హస్తినలో మాత్రం సెగలు రేపుతూనే ఉంది.
Andhra Pradesh Politics: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరణరంగంగా మారుతోంది. రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడినా హస్తినలో మాత్రం సెగలు రేపుతూనే ఉంది. ప్రభుత్వంపై రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు ఈసీకి టీడీపీపై కంప్లైంట్ ఇచ్చారు వైసీపీ ఎంపీలు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. మరోవైపు అమిత్‌షాకు పోటీపడి మరీ ఫిర్యాదు చేశారు రెండు పార్టీల ఎంపీలు.
ముందు చెప్పినట్టుగానే టీడీపీ గుర్తింపు రద్దుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు వైసీపీ ఎంపీలు. రాష్ట్రంలో పరిణామాలను, టీడీపీ నేతల తీరును ఎన్నికల కమిషనర్లకు వివరించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయ అలజడి సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. లోకేష్, పట్టాభి, దేవినేని ఉమ, బోండా ఉమ, అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
కాగా, ఈ రాజకీయ రణరంగం నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పోటాపోటీగా మంతనాలు జరిపారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశం సందర్భంగా లాబీల్లో ఈ సీన్ కనిపించింది. ఒకవైపు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మరోవైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అమిత్‌షాతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. గోరంట్ల మాధవ్ లేఖ ఇచ్చి మరీ చంద్రబాబు, టీడీపీ తీరుపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు కుట్రలను అడ్డుకోవాలని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు మాధవ్.
టీడీపీని నిషేధించాలి.. ఇదిలాఉంటే.. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రిరవ్గ సమావేశంలోనూ టీడీపీ అంశంపై జోకులు పేలాయి. సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కేబినెట్ భేటీలో టీడీపీ గురించి ఛలోక్తులు విసిరారు. మావోయిస్టులపై నిషేధాన్ని పొడిగించే అంశంపై చర్చ సందర్భంగా.. టీడీపీ పేరును కూడా ప్రస్తావించారు బొత్స సత్యనారాయణ. పనిలో పనిగా టీడీపీ పైనా నిషేధం పెట్టేయండి అంటూ బొత్స్య కామెంట్స్ చేశారు. దాంతో మంత్రివర్గ సభ్యులంతా నవ్వుకున్నారు.
Also read:
Personal Loans: పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..