CM Ramesh: బీజేపీ-టీడీపీ పొత్తుపై సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మళ్లీ పాత మిత్రుల మధ్య కొత్త పొత్తు పొడుస్తుందా? టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతల వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి?

CM Ramesh: బీజేపీ-టీడీపీ పొత్తుపై సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు
Cm Ramesh
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 28, 2021 | 9:56 PM

ఏపీలో మళ్లీ పాత మిత్రుల మధ్య కొత్త పొత్తు పొడుస్తుందా? టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతల వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? టీడీపీతో బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు ఎంపీ సీఎం రమేష్‌. టీడీపీతో పొత్తు ఉండదని బుధవారం బీజేపీ రాష్ట్ర కో-ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే ఎంపీ సీఎం రమేష్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది.

“టీడీపీతో బీజేపీ పొత్తు ఉండేది, లేనేది… లేదంటే ఏ పార్టీతో పొత్తు ఉంటుంది. ఏ పార్టీ పొత్తు ఉండదు అని సునీల్ దియోదర్ కానీ, జీవీఎల్ నరసింహారావు కానీ, సీఎం రమేశ్ కానీ నిర్ణయించేది కాదు. ఇది జాతీయ పార్టీ కనుక జేపీ నడ్డా గారు, బీఎల్ సంతోష్ గారు, లేదా అమితా షా గారు నిర్ణయిస్తారు. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు.. ఆయన బీజేపీతో అలెయన్స్ పెట్టుకుంటాడని మనమెప్పుడైనా అనుకున్నామా..? రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇది మా పరిధిలోని అంశం కాదు” అని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.

బుధవారం ఇదే అంశంపై పార్టీ రాష్ట్ర కో-ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ రియాక్ట్‌ అయ్యారు. భవిష్యత్‌లో టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ మాజీ నేతలు, ప్రస్తుత బీజేపీ నేతల తీరుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సుజనాచౌదరికి పచ్చరంగు వదల్లేదని వ్యాఖ్యానించారు. అమిత్‌షా పక్కనే సుజనా చౌదరి ఉన్న ఫొటో పెట్టి ట్వీట్‌ చేశారు. సుజనా ఇంకా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, అమిత్‌షాతో చంద్రబాబు అపాయింట్‌మెంట్‌కు తెగప్రయత్నాలు చేశారని కామెంట్స్‌ పెట్టారు విజయసాయి.

Also Read: ‘అమ్మ ఒడి’ డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే… ఏపీ సర్కార్ కొత్త షరతు

అప్పగింతల్లో ఏడవకుండా, ఫుల్ ఖుషీగా వధువు.. ఆమె చెప్పిన రీజన్ వింటే షాక్ తినాల్సిందే