Andhra Pradesh: ‘అమ్మ ఒడి’ డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే… ఏపీ సర్కార్ కొత్త షరతు

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Andhra Pradesh: 'అమ్మ ఒడి' డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే... ఏపీ సర్కార్ కొత్త షరతు
Amma Vodi
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 28, 2021 | 3:11 PM

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.  వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.  1285 కొత్త ఉద్యోగాలు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ లో ఫార్మాసిస్టుల పోస్టుల కల్పనకు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. మెడికల్ కళాశాలలో 2190 మందిని నియమించుకునేందుకు వీలుగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని వివరించారు.  మొత్తంగా 4035 కొత్త ఉద్యోగాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం లభించింది.

కాగా  వైద్యారోగ్య శాఖలో 41,308 ఉద్యోగాల భర్తీకి లక్ష్యం గా ఉంటే 26,917 ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానం కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదని.. ఏపీ మంత్రిమండలి ఈ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయించింది.  2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పధకం జూన్ మాసంలో అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తింస్తుందని… ప్రచారం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయాలన్నారు. కాగా నాణ్యమైన ప్రమాణాలతో విద్య భోదిస్తోన్న ఏపీ సర్కార్.. అందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇంతా చేస్తున్నా.. విద్యార్థులను స్కూల్‌కి తీసుకురాకపోతే అనుకున్న మేర ఫలితాలు రావు. అందుకే ఏపీ సర్కార్ హాజరుతో అమ్మ ఒడిని ముడి పెట్టాలని చూస్తోంది.

Also Read: విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ… ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్

పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు