Tirumala : బ్లాక్ మార్కెట్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు..మండిపడుతోన్న శ్రీవారి భక్తులు..
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేస్తారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేస్తారు. అందుకు తగ్గట్లే మార్కెట్లో వీటికి భారీగా డిమాండ్ ఉంది. అయితే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటి బ్లాక్ దందాపై టీటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
తాజాగా దేవుళ్లు. కామ్ అనే ఓ నకిలీ వెబ్‌సైట్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు దర్శనమిచ్చాయి. ఇందులో రూ.130 పలికే టీటీడీ డైరీని రూ.243లకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా రూ.60 ధర కలిగిన క్యాలెండర్‌ను రూ.198లకు అమ్ముతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అమ్మడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరుతున్నారు.
Also Read: