Nagarjuna-CM Jagan: ఈరోజు సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున… సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సినీ బృందం
Nagarjuna-CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ హీరో...
Nagarjuna-CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ హీరో అక్కినేని నాగార్జున భేటీ కానున్నారు. ఈ మేరకు నాగార్జున సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో కలిసి విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి నాగార్జున చేరుకున్నారు.
అయితే ఈరోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో సినీ టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకనే హీరో నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్నట్లు టాక్. అయితే టాలీవుడ్ నుంచి ఏ సినీ పెద్దలు .. సినీ నటీనటులు లేరు.. కేవలం ఇద్దరు నిర్మాతలతో వెళ్లినందున ఇప్పుడు సీఎం జగన్ తో సమావేశం టాలివుడ్ సమస్యలపైనా లేక వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.