Petrol Price: పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్న దేశం ఏది? అగ్గి పెట్టె కంటే తక్కువ ధర ఉన్న దేశం ఏది..? మన దేశంలో ఎలా ఉంది?

Petrol Price:భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడు ఎలా భగ్గుమంటాయో ఎవరికీ తెలీదు. అంతర్జాతీయ ముడిచమురు..

Petrol Price: పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్న దేశం ఏది? అగ్గి పెట్టె కంటే తక్కువ ధర ఉన్న దేశం ఏది..?  మన దేశంలో ఎలా ఉంది?
Petrol Price
Follow us

|

Updated on: Oct 28, 2021 | 12:58 PM

Petrol Price:భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడు ఎలా భగ్గుమంటాయో ఎవరికీ తెలీదు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రూపాయి ధర పతనం తదితర అంశాలపై ఆధారపడి మన దేశంలోని పెట్రోల్ ధరలో మార్పులు చోటు చేసుకుంటాయి. మన దేశంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు ఉండగా కొన్ని దేశాల్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 200 లు దేశాలు ఉన్నాయి. మరికొన్ని దేశాల్లో అగ్గిపెట్టికు కు చెల్లించే ధరతో లీటరు పెట్రోల్ ఖరీదు చేసుకోవచ్చు. ప్రపంచంలో చమురు-ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయి.. మరికొన్ని దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా దిగుమతి చేసుకునే దేశాలు ఉన్నాయి.

ఎక్కువ ధరకు పెట్రోల్ లభించే దేశాలు:

హాంకాంగ్ లో అత్యధిక ఇంధనం ధర కలిగి ఉంది. హాంకాంగ్ పెట్రోల్ కోసం $2.56 ( మనదేశంలో రూ. 192) చెల్లించాల్సి ఉంది. నెదర్లాండ్స్ లీటర్ ఇంధనంతో $2.18 (మన కరెన్సీలోరూ. 163) తో సెకండ్ ప్లేస్ లో ఉండగా.. మూడు స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది, ఇక్కడ లీటర్ పెట్రోల్ $2.14 ( మన కరెన్సీ లో రూ. 160) లు గా ఉంది. ఈ దేశాలతో పాటు నార్వే, ఇజ్రాయెల్, డెన్మార్క్, మొనాకో, గ్రీస్, ఫిన్లాండ్ , ఐస్‌లాండ్ వంటి ఇతర దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటాయి. డచ్ వంటి దేశంలో జనాభాలో ఎక్కువ మంది ప్రయాణం కోసం సైకిల్‌ను ఉపయోగిస్తారు.

పెట్రోల్ తక్కువ ధర ఉన్న దేశాలు :

వెనెజులా దేశంలో పెట్రోల్ మహా చౌక. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర కేవలం $0.02 ( మనదేశ కరెన్సీలో రూ. 1.50పై ) ఉంది. ఇక్కడ ఎక్కువుగా బ్యాటరీతో నడిచే కార్లు, మోటార్ బైక్స్ ఉంటాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ అగ్గిపెట్టె కొనడం కంటే ఇది చౌకాగా కొనుగోలు చేయవచ్చు. ఇరాన్ లో పెట్రోల్ లీర్ ధర చాలా తక్కువ $0.06 ( మనదేశ కరెన్సీ లో రూ. 4.51). ప్రపంచ వ్యాప్తంగా అంగోలా, అల్జీరియా, కువైట్, నైజీరియా, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, ఇథియోపియా వంటి దేశాల్లో పెట్రోల్ సరసమైన ధరల్లో లభిస్తుంది. దేశాలు $0.50 కంటే తక్కువ ధరలు ఉన్నాయి. లీటర్ పెట్రోల్ మన కరెన్సీలో మూడు నుంచి నాలుగు రూపాయలు.

మనదేశంలో చమురు ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ.. ధరల పెరుగుల ధరలకు అడ్డుకట్ట పడడం లేదు.

Also Read:  మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా ఎలా తీసుకోవాలంటే..