PPF: వీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై పూర్తి వడ్డీని పొందలేరు.. పన్ను మినహాయింపునకూ అర్హులు కారు..ఎందుకు తెలుసుకోండి!

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాను భారతదేశంలోని ఏ పౌరుడైనా తెరవవచ్చు. అయితే, ప్రవాస భారతీయులు లేదా ఎన్ఆర్ఐ(NRI)లు మాత్రం భారతదేశంలో పీపీఎఫ్ ఖాతాను తెరవలేరు. కానీ, వారికి ఇప్పటికే ఖాతా ఉంటే, వారు దానిని కంటిన్యూ చేయవచ్చు.

PPF: వీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై పూర్తి వడ్డీని పొందలేరు.. పన్ను మినహాయింపునకూ అర్హులు కారు..ఎందుకు తెలుసుకోండి!
Ppf For Nri
Follow us
KVD Varma

|

Updated on: Oct 28, 2021 | 1:31 PM

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాను భారతదేశంలోని ఏ పౌరుడైనా తెరవవచ్చు. అయితే, ప్రవాస భారతీయులు లేదా ఎన్ఆర్ఐ(NRI)లు మాత్రం భారతదేశంలో పీపీఎఫ్ ఖాతాను తెరవలేరు. కానీ, వారికి ఇప్పటికే ఖాతా ఉంటే, వారు దానిని కంటిన్యూ చేయవచ్చు. ఒక పౌరుడు ఇంతకు ముందు భారతదేశంలో నివసించి, తరువాత విదేశాలకు వెళ్లి ఆ ప్రదేశంలో పౌరసత్వం పొందాడని అనుకుందాం. ఇక్కడ అతని పీపీఎఫ్ ఖాతా దేశంలో నడుస్తోంది. ఇప్పుడు ఆ ఖాతా ఏమవుతుంది అనేది తెలుసుకుందాం..

ఆ ఎన్ఆర్ఐ వ్యక్తి కావాలనుకుంటే, అతను భారతదేశంలో తన పీపీఎఫ్ ఖాతాను (NRI కోసం PPF) కంటిన్యూ చేయవచ్చు. దీని కోసం, అతను ఒక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. కానీ రిటర్న్‌లు పొందే విషయానికి వస్తే, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. మొదటి షరతు ఏమిటంటే, ఆ ఎన్ఆర్ఐ పీపీఎఫ్ ఖాతా భారతీయ పౌరుడు పొందే అంత వడ్డీ పొందదు. అంటే, 7 శాతం వడ్డీ లభించదు. కానీ, భారతదేశంలో పొదుపు ఖాతాపై లభించే వడ్డీ మాత్రమే ఆ ఎన్ఆర్ఐకి చెందిన పీపీఎఫ్ ఖాతాపై లభిస్తుంది. ఈ వడ్డీ దాదాపు 4 శాతం చొప్పున అందుబాటులో ఉంటుంది.

వడ్డీ 4 శాతం మాత్రమే..

అలాగే, భారతదేశంలోని పీపీఎఫ్ ఖాతాపై పన్ను మినహాయింపు (NRI కోసం PPF) ఎన్ఆర్ఐలకు వర్తించదు. ఈ ఎన్ఆర్ఐ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందలేరు. ఆ ఎన్ఆర్ఐ ప్రతి సంవత్సరం తన పీపీఎఫ్ ఖాతాలో రూ.500 డిపాజిట్ చేయాలి. తద్వారా ఖాతా మనుగడలో ఉంటుంది. ఎన్ఆర్ఐల కోసం పీపీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసే నియమాలు కూడా భారతీయులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఎన్ఆర్ఐలు ఖాతా తెరిచిన 7 సంవత్సరాల తర్వాత మాత్రమే డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. వారు 15 సంవత్సరాల పాటు అంటే మెచ్యూరిటీ వరకు మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు. ఖాతా మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే 15 ఏళ్ల తర్వాత మాత్రమే మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తం ఎన్ఆర్ఐ ఖాతాలో జమ అవుతుంది.

పీపీఎఫ్ పై పన్ను మినహాయింపు ప్రయోజనం లేదు..

ఎన్ఆర్ఐ కోసం పీపీఎఫ్ పన్ను కోసం కూడా ఒక నియమం ఉంది. పీపీఎఫ్ ఖాతా పూర్తిగా పన్ను రహితం అయినప్పటికీ, ఎన్ఆర్ఐలకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. ఒక ఎన్ఆర్ఐ పీపీఎఫ్ ఖాతాను 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అంటే మెచ్యూరిటీపై మూసివేయాలి. అతని డబ్బు ఎన్ఆర్ఐ లేదా ఎన్ఆర్వో ఖాతాలో జమ చేస్తారు. అదే ఖాతా ప్రకారం, పీపీఎఫ్ మెచ్యూరిటీపై పన్ను తీసివేస్తారు. అటువంటి పరిస్థితిలో, ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది..పీపీఎఫ్ ఖాతాలో పూర్తి వడ్డీ అందుబాటులో లేనప్పుడు..పన్ను మినహాయింపు ప్రయోజనం లేనప్పుడు, ఎన్ఆర్ఐ ఏ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు? దీని గురించి తెలుసుకుందాం.

ఎన్ఆర్ఐ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి

ఎన్నారైలు తమకు కావాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ఆర్ఈ(NRE), ఎన్ఆర్వో(NRO), ఎఫ్సీఎన్ఆర్(FCNR) ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథకాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ కావాలనుకుంటే, అతను డైరెక్ట్ ఈక్విటీలో కూడా డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. డీమ్యాట్ ఖాతా ద్వారా నేరుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అతను కోరుకుంటే, అతను పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ లేదా ఎన్ఆర్ఈ(NRE), ఎన్ఆర్వో(NRO), ఖాతా ద్వారా కూడా ఈక్విటీలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఎన్ఆర్ఐ భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్లలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. రిచ్ ఎస్టేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎన్ఆర్ఐలు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి: PM Modi: భారత్-ఆసియాన్ 18వ సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. ఆసియా దేశాలతో సామరస్యమే ఎజెండా!

Air India: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై విమానం ఎక్కాలంటే.. ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలి!

WhatsApp: వాట్సాప్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీకోసమే..త్వరలో మీరు ఇలా చేయాల్సిందే!