AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఈ కంపెనీ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

Second Hand Car: కార్ల కంపెనీలలో రెనాల్ట్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సాధించింది. ఈ కంపెనీ సెకండ్‌ హ్యాండ్ కార్లు రూ.6.50 లక్షల నుంచి రూ.9 లక్షల

మీరు ఈ కంపెనీ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..
Triber
uppula Raju
|

Updated on: Oct 28, 2021 | 1:48 PM

Share

Second Hand Car: కార్ల కంపెనీలలో రెనాల్ట్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సాధించింది. ఈ కంపెనీ సెకండ్‌ హ్యాండ్ కార్లు రూ.6.50 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్య దొరుకుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కంపెనీ కార్లు చూడటానికి చక్కగా ఉంటాయి.  అందుకే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే ఈ కంపెనీలో ఫేమస్‌ కారు రెనాల్ట్ ట్రైబర్. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ రెనాల్ట్ ట్రైబర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.

ట్రైబర్ ఒక ఫ్యామిలీ కారుగా చెప్పవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇందులో చాల ఫీచర్లను అందించారు. మిగతా కార్లతో పోలిస్తే ఇందులో స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది. వీల్‌బేస్ కూడా డస్టర్ కంటే పొడవుగా ఉంటుంది. ఇందులో రెండు గ్లోవ్ బాక్స్‌లు ఉంటాయ. బాటిళ్లను ఉంచడానికి ముందు భాగంలో బాటిల్ హోల్డర్‌లు అమర్చారు. సెంట్రల్ కన్సోల్‌లో రెండు-డెక్ స్టోరేజ్ కూడా కేటాయించారు. పిల్లర్ మౌంటెడ్ AC వెంట్ లను కారు వెనక భాగంలో పొందుపరిచారు. సెంట్రల్ స్టోరేజ్, స్పేస్ కూడా ఉంటుంది. ఈ కారులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. ట్రైబర్ 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 70 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరొక వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

AP Cabinet Decisions: ముగిసిన భేటి.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Weather Report: రైతులకు హెచ్చరిక.. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ 31 వరకు భారీ వర్షాలు..

NEET UG 2021: NEET UG ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.. వివరాలు తెలుసుకోండి..