Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీకోసమే..త్వరలో మీరు ఇలా చేయాల్సిందే!

ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ వాడుతున్న వారికి ఇది ముఖ్యమైన వార్త. వాట్సాప్(WhatsApp) అతి త్వరలో వారి గుర్తింపు కార్డు లేదా ఐడీ (ID) రుజువు కోసం వినియోగదారులను అడగవచ్చు.

WhatsApp: వాట్సాప్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీకోసమే..త్వరలో మీరు ఇలా చేయాల్సిందే!
Whatsapp Payment App
Follow us
KVD Varma

|

Updated on: Oct 28, 2021 | 7:49 AM

WhatsApp: ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ వాడుతున్న వారికి ఇది ముఖ్యమైన వార్త. వాట్సాప్(WhatsApp) అతి త్వరలో వారి గుర్తింపు కార్డు లేదా ఐడీ (ID) రుజువు కోసం వినియోగదారులను అడగవచ్చు. వాట్సాప్ యాప్ ద్వారా చెల్లించే వినియోగదారులకు ఐడీ రుజువు కచ్చితంగా ఉండాలని వాట్సాప్ తన వినియోగదారులను కోరనుంది. ప్రస్తుతం మన దేశంలో పేమెంట్ యాప్స్ చాలా ఉన్నాయి. కానీ అవేవీ ఐడీ రుజువు అడగవు. పేమెంట్ యాప్స్ లో ప్రజలు విరివిగా ఉపయోగించే ఫోన్ పే(PhonePe) అదేవిధంగా(Google Pay) కూడా తమ వినియోగదారులను ఐడీ రుజువు కోరవు. కేవలం బ్యాంక్ సంబంధిత వివరాలను మాత్రమే ఈ యాప్స్ అడుగుతాయి. అయితే, ప్రస్తుతం వాట్సాప్ మాత్రమే ఇటువంటి నిబంధన తీసుకురానుండటం విశేషం.

వాట్సాప్ (WhatsApp) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి, దీని ద్వారా చాట్, కాల్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఇతీవల వాట్సాప్ పేమెంట్స్ విధానాన్ని కూడా ప్రారంభించింది. ఈ చెల్లింపు ఎంపిక కొన్ని రోజుల నుండి అమలులో ఉంది. గత సంవత్సరం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) దశలవారీగా చెల్లింపులను ప్రారంభించడానికి అనుమతిని ఇచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, వాట్సాప్(WhatsApp) చెల్లింపు సత్వరమార్గాన్ని ఉపయోగించి చెల్లింపులను పరీక్షించడం ప్రారంభించింది. ఇది యాప్‌లో జరిగింది. దీని కోసం వినియోగదారు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. చాట్‌బాక్స్ నుండి చెల్లింపు సౌకర్యాన్ని పొందుతారు.

పెద్ద మార్పుకు సిద్ధం అవుతున్న వాట్సాప్..

వాట్సాప్ (WhatsApp) అతిపెద్ద మార్పు చేయడానికి సిద్ధమవుతోంది. ఎపీకే(APK) టియర్‌డౌన్ ప్రకారం, వాట్సాప్ అతి త్వరలో ఐడీ ప్రూఫ్‌తో ధృవీకరించమని దాని వినియోగదారులను కోరవచ్చు. వినియోగదారులు వాట్సాప్ ద్వారా చెల్లింపు చేయాలనుకుంటే, ఐడీ రుజువును ధృవీకరించమని అతన్ని అడగవచ్చు. వాట్సాప్ v2.21.22.6 బీటా వెర్షన్‌లో కొత్త స్ట్రింగ్ అందించారు. ఇది కొత్త ధృవీకరణ వ్యవస్థను సూచిస్తుంది.

బ్రెజిల్ లో ఇలా..

సోషల్ మీడియా యాప్ ద్వారా పేమెంట్స్ బ్రెజిల్ లో మాత్రమే అమలులో ఉంది. అక్కడ ఫేస్ బుక్ పే ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అదేవిధంగా వాట్సాప్ పే కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ డెబిట్, క్రెడిట్ కార్డులను ధృవీకరించే విధానంలో ఐడీ కూడా అడుగుతారు. ప్రస్తుతం అదేవిధంగా వినియోగదారుల గుర్తింపును అడిగే విధానాన్ని భారత్ లో కూడా వాట్సాప్ అనుసరించనుంది.

గూగుల్ పే(Google Pay) ID రుజువును అడగదు

గూగుల్ పే(Google Pay) లేదా ఫోన్ పే(PhonePe) వంటి యూపీఐ (UPI)లో నడుస్తున్న ఇతర యాప్‌లు వినియోగదారుని ఐడీ రుజువు కోసం అడగవు. అయితే, పేటీఎం, మోబిక్విక్ (Paytm, MobiKwik) వంటి పేమెంట్ యాప్‌లు ముందుగా కస్టమర్‌ల కోసం కేవైసీ (KYC) చేస్తాయి. కేవైసీ ధృవీకరణ తర్వాత మాత్రమే చెల్లింపు సౌకర్యం ఇస్తాయి ఈ యాప్‌లు. వాట్సాప్ ఈ సన్నద్ధతతో, వ్యాపార చెల్లింపులు కూడా జరపవచ్చు. వాట్సాప్ యాప్‌లో వ్యాలెట్ వంటి ఫీచర్లను జోడించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వాట్సాప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి: Heart Beat: గుండె వేగంగా కొట్టుకుంటే పెను ప్రమాదం.. హృదయ స్పందన వేగాన్ని నియంత్రించే బెలూన్ రూపొందించిన పరిశోధకులు!

NASA: అంగారకుడిపై తన 14వ మిషన్ విజయవంతంగా పూర్తి చేసిన నాసా ఇంజినిటీ హెలికాప్టర్

Pearl Farming: బకెట్లలో ముత్యాల సాగుబడి.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి.. ఎలానో తెలుసుకుందాం రండి!