Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు మరింత సౌలభ్యం కోసం నయా ఫీచర్లు..  వీడియో

Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు మరింత సౌలభ్యం కోసం నయా ఫీచర్లు.. వీడియో

Phani CH

|

Updated on: Oct 28, 2021 | 9:47 AM

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లకు రంగం సిద్ధం చేస్తోంది. యూజర్లకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో తాజా ఫీచర్లతో వస్తోంది.

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లకు రంగం సిద్ధం చేస్తోంది. యూజర్లకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో తాజా ఫీచర్లతో వస్తోంది. వాటిలో ఆడియో మెసేజ్ ప్రివ్యూ, వాట్సాప్ కమ్యూనిటీ, వాట్సాప్ ప్లేయర్, మీడియా అన్ డు, మల్టీ డివైస్ సపోర్ట్ ముఖ్యమైనవి. వాట్సాప్ లో ఆడియో మెసేజ్‌లు పంపొచ్చన్న సంగతి తెలిసిందే. అయితే ఒకసారి రికార్డు చేసిన ఆడియో మెసేజ్ ను ఎడిట్ చేయడం కుదిరేది కాదు. అయితే, మార్పులు చేర్పులకు వీలు కల్పించే ఆడియో మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. ఆడియో సందేశం రికార్డు చేసిన తర్వాత దాన్ని మనం ఓసారి వినొచ్చు. అవసరమైన మార్పులతో కొత్త మెసేజ్ రూపొందించవచ్చు. వాట్సాప్ లో పంపించే ఆడియో సందేశాలు వినేందుకు ప్లేయర్ ఫీచర్ కు మెరుగులు దిద్దుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

అమెరికా డ్రోన్‌ దాడి.. అల్‌ ఖైదా అగ్రనేత అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతం.. వీడియో

Viral Video: వాహనదారులతో పోటీ పడి పరిగెత్తిన నిప్పుకోడి..వీడియో వైరల్..