Viral Video: వాహనదారులతో పోటీ పడి పరిగెత్తిన నిప్పుకోడి..వీడియో వైరల్..
నిప్పుకోడి...ఎగరలేని పక్షి జాతుల్లో ఇది అతి పెద్దది. దీనినే ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ అని కూడా పిలుస్తుంటారు..
నిప్పుకోడి…ఎగరలేని పక్షి జాతుల్లో ఇది అతి పెద్దది. దీనినే ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ అని కూడా పిలుస్తుంటారు. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే కనిపిస్తుంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ రోడ్లపై దర్శనమిచ్చిన ఆస్ట్రిచ్.. వాహనదారులతో పాటు వేగంగా పరిగెత్తుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాటిని అడవుల్లో వదిలిపెట్టండి.. ‘లాహోర్ నగరం సమీపంలోని అడువుల నుంచి తప్పించుకుని మొత్తం రెండు నిప్పుకోళ్లు రోడ్డు మీదకు వచ్చాయి. అయితే కొందరు వాహనదారులు వాటిని పట్టుకుని ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మెడకు తీవ్ర గాయమై ఒకటి మృత్యువాత పడింది’ అని పాకిస్తాన్ కు చెందిన ఓ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ‘జంతువులు అడవుల్లోనే క్షేమంగా ఉంటాయి. మనుషుల మధ్యన అవి సుఖంగా జీవించలేవు. దయచేసి వాటిని అడవుల్లో వదిలిపెట్టండి’ అని భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
Wtf is an ostrich doing at canal road lahore Which of you told it “Paa ji tussi nair o nair ho jana ai”pic.twitter.com/I5J9Laofit
— Biyaa ⚕️ (@Biiiyaa) October 26, 2021
Also Read: