Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Variant AY.4.2: యూకేను వణికిస్తున్న డెల్టా వేరియంట్‌ AY4.2..  ఒక్కరోజే 52 వేలకు పైగా కేసులు నమోదు.. (వీడియో)

Delta Variant AY.4.2: యూకేను వణికిస్తున్న డెల్టా వేరియంట్‌ AY4.2.. ఒక్కరోజే 52 వేలకు పైగా కేసులు నమోదు.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 28, 2021 | 4:49 PM

రెండేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరోనా వైరస్‌ కొత్తరకం వేరియెంట్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది.


రెండేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరోనా వైరస్‌ కొత్తరకం వేరియెంట్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియెంట్‌ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండేళ్లుగా కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే డెల్టా వేరియెంట్‌ తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన ఏవై.4.2 కరోనా కేసులు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను వణికిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా ఈ కొత్త రకం వేరియెంట్‌ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియెంట్‌లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియెంట్‌ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్‌ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రిటన్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అక్టోబరు 21న ఒక్క రోజే 52 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా లండన్‌ జెనెటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఫ్రాంకోయిస్‌ బల్లాక్స్‌ వెల్లడించారు. ఇక రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోద వుతుండటంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులు నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో, అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ ప్రజల ను కోరారు. మాస్క్‌ ధరించకపో వడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్‌ చేయాలని యోచిస్తోంది. రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈనెల 28 నుంచి మూసి వేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)