- Telugu News Photo Gallery Technology photos Zoom going to Introduce new feature Zoom Transcription for live translation
Zoom Transcription: ఇకపై సమాచార మార్పిడికి భాష అడ్డం కాదు.. మరో అద్భుత ఫీచర్ తీసుకొస్తున్న జూమ్..
Zoom Transcription: కరోనా తర్వాత జూమ్ యాప్ వినియోగం బాగా పెరిగింది. యూజర్ల అవసరాల మేరకు యాప్ నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Oct 28, 2021 | 6:26 AM

కరోనా నేపథ్యంలో వర్చువల్ సంభాషణలకు బాగా డిమాండ్ పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అందరూ జూమ్‌లోనే మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి.

ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారినైనా తమకు నచ్చిన వ్యక్తులతో ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడుకునే అవకాశం లభించింది. జూమ్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ సంస్థ కూడా పలు అడ్వాన్స్ ఫీచర్లను పరిచయం చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది జూమ్. సాధారణంగా మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవం కష్టం. ఇది అందరం ఎదుర్కొనే సమస్య.

ఈ సమస్యకు చెక్ పెట్టడానికే జూమ్ ట్రాన్సిక్రిప్షన్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న భాషను అప్పటికప్పుడు మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేషన్ చేసుకునే అవకాశాన్ని తీసుకు రానున్నారు.

ఇందులో భాగంగా మొత్తం 12 భాషల్లో ట్రాన్స్‌లేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అలాగే.. 30 భాషలను ఆటోమేటెడ్ ట్రాన్స్‌క్ప్రిషన్ రూపంలో కనిపించేలా చేయాలనీ భావిస్తోంది.

వచ్చే ఏడాది నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఎలాంటి మార్పులకు నాంది పడుతుందో చూడాలి.





























