Pushpa Third Song: పుష్ప థర్డ్‌ సింగిల్‌ వచ్చేసింది..సామీ నా సామీ అంటోన్న పుష్పరాజ్‌, శ్రీవల్లి..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌

Pushpa Third Song: పుష్ప థర్డ్‌ సింగిల్‌ వచ్చేసింది..సామీ నా సామీ అంటోన్న పుష్పరాజ్‌, శ్రీవల్లి..
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2021 | 12:46 PM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ, అతని ప్రేయసి శ్రీ వల్లి పాత్రలో రష్మిక కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ‘దాక్కో దాక్కో మేక’, ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి’ పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. ‘సామీ నా సామీ’ అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటను చిత్ర బృందం గురువారం సోషల్‌ మీడియాలో పంచుకుంది. సింగర్‌ మౌనికా యాదవ్‌ ఆలపించిన ఈ మాస్‌ సాంగ్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ ను రెండు భాగాలుగా విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ నటుడు ఫహిద్‌ ఫాజిల్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. బన్మీ, రష్మిక తమ కెరీర్‌లో మొదటిసారి డీ గ్లామర్‌ పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read:

Viral Video: స్టైలిష్‌ స్టార్‌ని దించేసింది..డీజే స్టెప్టులతో పిచ్చెక్కించేసింది.. ఫిదా అవుతోన్న బన్నీ ఫ్యాన్స్‌..

Keerthy Suresh: పెద్దన్నలో కీర్తిసురేష్ పాత్రపై క్లారిటీ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

Katrina Kaif: త్వరలో ప్రియుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకోనున్న కత్రినా కైఫ్.. వివాహ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?