Viral Video: స్టైలిష్ స్టార్‌ని దించేసింది..డీజే స్టెప్టులతో పిచ్చెక్కించేసింది.. ఫిదా అవుతోన్న బన్నీ ఫ్యాన్స్..
టాలీవుడ్‌లో 'ది మోస్ట్ స్టైలిష్' హీరో అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు 'అల్లు అర్జున్'. ఫ్యాన్స్ ముద్దుగా'బన్నీ' అని

టాలీవుడ్‌లో ‘ది మోస్ట్ స్టైలిష్’ హీరో అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ‘అల్లు అర్జున్’. ఫ్యాన్స్ ముద్దుగా’బన్నీ’ అని పిల్చుకునే ఈ హీరోకు సోషల్ మీడియాలోనూ ఎంతో క్రేజ్ ఉంది. తన పోస్ట్‌లకు లక్షలాది లైకులు, కామెంట్లు వస్తుంటాయి. ఇక తమ అభిమాన హీరోను అనుకరిస్తూ చాలామంది అభిమానులు, నెటిజన్లు ఎన్నో అద్భుతమైన పోస్ట్‌లు షేర్ చేస్తుంటారు.స్టైలిష్ స్టార్ సినిమాల్లో చేసిన డ్యాన్స్‌లు, ఫైట్లను తమ దైన స్టైల్‌లో రిక్రియేషన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో బన్నీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘డీజే (దువ్వాడ జగన్నాథం)’. ఇందులోని ‘గుడిలో బడిలో మదిలో’ అనే పాటకు బన్నీ, పూజ వేసిన స్టెప్పులు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ పాటను అనుకరిస్తూ ఎంతోమంది డ్యాన్స్ వీడియోలు షేర్ చేశారు. వీటికి సోషల్ మీడియాలో కూడా భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలో మృణాలి కిరణ్ అనే ఓ అమ్మాయి కూడా ‘గుడిలో బడిలో మదిలో’ పాటకు అద్భుతంగా కాలు కదిపింది. పాటలో అల్లు అర్జున్ కనిపించిన తరహాలోనే ముస్తాబై కుర్చీలో కూర్చొని డ్యాన్స్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ‘సూపర్బ్’, ‘ఎక్స్‌లెంట్’, ‘స్టైలిష్ స్టార్ ని దించేశావ్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Loved recreating this one ? @alluarjun sir’s grace in this song was so so smooth ? #alluarjun #stylishstaralluarjun #alluarjundance pic.twitter.com/Tr0qF6n8Lq
— Mrinali Kiran (@KiranMrinali) October 27, 2021
Also Read: