Allu Arjun: చిత్ర పరిశ్రమకు అమ్మాయిలు రావాలి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Varudu Kaavalenu Movie: కరోనా అనంతరం చిత్ర పరిశ్రమలో అన్ని సమస్యలూ క్రమంగా తొలగిపోతున్నాయని.. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తున్నారని.. ఇదే ఉత్సాహం కొనసాగాలని

Allu Arjun: చిత్ర పరిశ్రమకు అమ్మాయిలు రావాలి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
Allu Arjun
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 28, 2021 | 10:51 AM

Varudu Kaavalenu Movie: కరోనా అనంతరం చిత్ర పరిశ్రమలో అన్ని సమస్యలూ క్రమంగా తొలగిపోతున్నాయని.. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తున్నారని.. ఇదే ఉత్సాహం కొనసాగాలని కోరుకుంటున్నానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది. లక్ష్మీసౌజన్య దర్శకత్వంతో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ సినమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. నాగశౌర్య సినిమాలన్నీ చూశానని.. తనలో అందం, అమాయకత్వం ఉంటుందని.. పెద్ద హీరో అవుతాడని పేర్కొన్నారు. తనలా స్వతంత్య్రంగా ఎదిగినవాళ్లంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ‘పెళ్లి చూపులు’ చూసిన తర్వాత రీతూ వర్మ గురించి కనుక్కున్నానని.. తెలుగమ్మాయి అని తెలిసి సంతోషించాన్నారు. వరుడు కావలెను సినిమాలో దిగు దిగు నాగ పాటంటే.. చాలా ఇష్టమని తెలిపారు. తన ఇంట్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందని తెలిపారు.

లక్ష్మీసౌజన్య దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉందని.. అమ్మాయిలు చిత్ర పరిశ్రమకి రావాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ముంబయిలో సినిమా చేసేటప్పుడు సెట్లో యాభై శాతం అమ్మాయిలే కనిపిస్తుంటారని.. మన దగ్గర ఇలా ఎప్పుడు కనిపిస్తారా అనుకుంటుంటాంమని పేర్కొన్నారు. ఆ రోజుల వచ్చాయని నమ్ముతున్నానన్నారు. సాధారణంగా అమ్మాయిలు హీరోయిన్లు అయ్యేందుకు ఇండస్ట్రీకి వస్తుంటారని, అలాకాకుండా దర్శకులుగా, ఇతర టెక్నీషియన్లుగానూ మహిళలు రావాలన్నదే తన అభిమతమంటూ అల్లు అర్జున్ వివరించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ఈ సినిమా తాను చూశానని.. చాలా బాగుందని తెలిపారు.

Also Read:

Radhe Syam: ప్రపంచప్రఖ్యాత జ్యోతిష్కుడు చెయిరోగా ప్రభాస్.. సరికొత్త కోణంలో అంటూ టాక్..

Aryan Drugs Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న స్వతంత్ర సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్!