Aryan Drugs Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న స్వతంత్ర సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత, అతనితో సెల్ఫీ దిగిన కిరణ్ గోసావిని పూణేలో అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో సాక్షిగా మారిన తర్వాత గోసవి పరారీలో ఉన్నాడు.

Aryan Drugs Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న స్వతంత్ర సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్!
Aryan Drugs Case Witness Kiran Gosavi
Follow us
KVD Varma

|

Updated on: Oct 28, 2021 | 8:20 AM

Aryan Drugs Case: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత, అతనితో సెల్ఫీ దిగిన కిరణ్ గోసావిని పూణేలో అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో సాక్షిగా మారిన తర్వాత గోసవి పరారీలో ఉన్నాడు. కోట్లాది రూపాయల వ్యవహారంలో గోసవిపై ఆయన అంగరక్షకుడు ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశాడు. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌తో సెల్ఫీ దిగడం ద్వారా గోసావి కూడా వెలుగులోకి వచ్చాడు. అనేక మలుపులు తిరుగుతున్నా ఆర్యన్ డ్రగ్స్ కేసులో కిరణ్ గోసావి అరెస్ట్ పెద్ద మలుపుగా చెప్పవచ్చని అధికారులు అంటున్నారు.

ఆర్యన్ అరెస్ట్ అయినపుడు కిరణ్ గోసావి క్రూయేజ్ వద్దే ఉన్నాడు. ఆర్యన్ అరెస్ట్ సమయంలో అతనితో గోసావి సెల్ఫీ దిగడం వివాదాస్పదంగా మారింది. ఆర్యన్ అరెస్ట్ తరువాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కిరణ్ గోసావి అదృశ్యం అయిపోయారు. ఈ కేసులో గోసావిని “స్వతంత్ర సాక్షి” ఎన్సీబీ పేర్కొంది. అయితే, సాక్షిగా గోసావి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అతని కోసం పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు.

ఇప్పటికే కిరణ్ గోసావి మీద లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. అయితే మూడురోజుల క్రితం అజ్ఞాతంలో ఉన్న త్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని పేర్కొంటూ ప్రకటన చేశాడు. మహారాష్ట్రలో తనకు “బెదిరింపు” ఉన్నందున ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. మిస్టర్ గోసావి తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తర్వాత తోసిపుచ్చారు.

ఆర్యన్ బెయిల్ పై ఈరోజు మరోసారి వాదనలు..

క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చెంట్ , మున్ మున్ ధమిచా కు కూడా బుధవారం బెయిల్ రాలేదు. అక్టోబర్ 8 నుంచి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ కేసు ఇప్పుడు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. బుధవారం కోర్టులో విచారణ సందర్భంగా, అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) అనిల్ సింగ్ గురువారం గంటలో సమాధానం ఇస్తే, గురువారమే కేసును ముగించడానికి ప్రయత్నిస్తానని న్యాయమూర్తి చెప్పారు. ఆర్యన్ బెయిల్ దరఖాస్తు ఇప్పటికే 2 సార్లు తిరస్కరించబడింది. అక్టోబర్ 8 నుంచి జైలులో ఉన్నాడు. అక్టోబర్ 2న ఆర్యన్ క్రూయిజ్ నుండి పట్టుబడ్డాడు.

ఇవి కూడా చదవండి: Heart Beat: గుండె వేగంగా కొట్టుకుంటే పెను ప్రమాదం.. హృదయ స్పందన వేగాన్ని నియంత్రించే బెలూన్ రూపొందించిన పరిశోధకులు!

NASA: అంగారకుడిపై తన 14వ మిషన్ విజయవంతంగా పూర్తి చేసిన నాసా ఇంజినిటీ హెలికాప్టర్

Pearl Farming: బకెట్లలో ముత్యాల సాగుబడి.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి.. ఎలానో తెలుసుకుందాం రండి!