Crime News: వారి టార్గెట్ బ్యాచిలర్స్.. యువతులతో నగ్న వీడియో కాల్స్.. ఆపై.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో మోసం చేసేవాళ్లు తెలివి మీరిపోతున్నారు. తమ పంధాను ఎప్పటికప్పుడు...

Crime News: వారి టార్గెట్ బ్యాచిలర్స్.. యువతులతో నగ్న వీడియో కాల్స్.. ఆపై.!
Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2021 | 9:37 AM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో మోసం చేసేవాళ్లు తెలివి మీరిపోతున్నారు. తమ పంధాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అమాయకులను ఇట్టే మోసం చేస్తున్నారు. తాజాగా ఓ కిలాడీ జంట ఏకంగా 200 మందిని మోసం చేసి సుమారు రూ. 22 కోట్లను దోచేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన స్వప్నా, యోగేశ్ భార్యాభర్తలు. వీరిద్దరూ కూడా కష్టపడకుండా ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డారు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా ఇంటర్నెట్ ద్వారా తమకు పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని సలహా అడిగారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.. వాటిని రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చునని ఆ కేటుగాడు.. వీరికి సలహా ఇచ్చాడు. దీనితో స్వప్నా, యోగేశ్ ఈ దందాలోకి దిగారు.

కొంతమంది యువతులకు వీడియో కాల్స్ ఎలా మాట్లాడాలన్న దానిపై స్వప్న శిక్షణ ఇవ్వగా.. యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. మొదటిగా ఓ వెబ్‌సైట్ సాయం తీసుకుని ఈ జంట నగ్నంగా వీడియో కాల్స్ చేసేవారు. కాల్ చేయాలంటే ముందుగానే నిమిషానికి రూ. 200పైగా చెల్లించాలని బాధితులకు చెప్పేవారు. ఇలా తమ దందాను షూరూ చేసి ఈ జంట క్రమేపీ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత ఈ జంట వెబ్‌సైట్‌కు చెల్లించే మొత్తం కంటే తక్కువలోనే వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్ చేసి అవతల వారు నగ్నంగా మాట్లాడేలా చేసేవారు. తద్వారా ఆ కాల్‌ను రికార్డు చేసి అడిగినంత డబ్బులు ఇవ్వాలంటూ బాధితులను బెదిరించేవారు.

కాగా, గత రెండేళ్లుగా ఈ దందా సాగిస్తూ బాధితుల నుంచి సుమారు రూ. 22 కోట్లను దోచుకున్నారు ఈ కిలాడీ జంట. నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడే యువతులకు నెలకు రూ. 25 వేలు.. కేవలం మెసేజ్‌లు చేసేవారికి రూ. 15 వేలు జీతాలు చెల్లించేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి సుమారు రూ. 80 లక్షలు సంస్థ ఖాతా నుంచి మాయం చేయడంతో.. ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ జంట దందా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో భార్యాభర్తలతో సహా మరో ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!