Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!

సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని 'మహాపురాణం' అని పిలుస్తారు. ఇందులో పొందుపరిచిన విషయాలన్నీ కూడా స్వయంగా విష్ణువు...

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!
Garuda Puranam
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2021 | 9:05 AM

సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని ‘మహాపురాణం’ అని పిలుస్తారు. ఇందులో పొందుపరిచిన విషయాలన్నీ కూడా స్వయంగా విష్ణువు చెప్పినవిగా పరిగణిస్తారు. ఆ విషయాలన్నీ కూడా అర్ధం చేసుకుని జీవితంలో ఆచరణలోకి పెట్టిన వ్యక్తులు.. సమస్యలను దూరం చేసుకోగలరు.

ఇదిలా ఉంటే.. కుటుంబంలో ఉండే ప్రతీ ఒక్కరు విభిన్నంగా ఉంటారు. ప్రవర్తనలోనైనా, స్వభావంలోనైనా.. ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. కుటుంబంపై ప్రేమ ఉన్నప్పటికీ.. పలు సందర్భాల్లో ఏదొక విషయంపై గొడవలు జరుగుతుంటాయి. అలాంటి ఇంట శాంతి కరవు అవుతుంది. ఆ మనుషుల్లో సహానం తగ్గుతుంది. గరుడ పురాణం ప్రకారం, చాలాసార్లు చెడు అలవాట్లు ఈ పరిస్థితులకు దారి తీస్తాయి.

ఈ అలవాట్లు ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అనుకూల పరిస్థితులను అటుంచితే.. ప్రతికూల పరిస్థితులు తీసుకొచ్చే ఛాన్స్‌లే ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇంటి ఆనందాన్ని, శాంతిని దూరం చేసే ఆ అలవాట్లు గురించి తెలుసుకోండి.

కిచెన్‌ను శుభ్రంగా ఉంచకపోవడం…

నాడు ఆలస్యమైనా కూడా కిచెన్ మొత్తాన్ని శుభ్రం చేసిన తర్వాతే నిద్రకు ఉపక్రమించేవారు. అయితే ఈకాలంలో చాలామందికి అలాంటి పట్టింపులు ఏమిలేవు. ఉదయం లేదా మధ్యాహ్నం పని మనిషి వస్తుంది కదా అన్నట్లుగా రాత్రిపూట మురికి పాత్రలు అన్నీ కూడా అలానే ఉంచేస్తున్నారు. కానీ గరుడ పురాణం ప్రకారం, రాత్రిపూట మురికి పాత్రలను వదిలివేయడం పేదరికానికి సంకేతం. దీని వల్ల ఇంట్లో గొడవలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయట.

ఇంటిని మురికిగా ఉంచడం..

ఉరుకుల పరుగులు జీవితం కావడంతో నేటి యువతకు తమ ఇంటిని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవడంలో టైం సరిపోవట్లేదు. అయితే వాస్తవానికి ఇల్లు పరిశుభ్రంగా, క్రమబద్దంగా ఉండటం చాలా ముఖ్యం. తద్వారా వ్యాధులు దరికి చేరకుండా నివారించవచ్చు. గరుడ పురాణం ప్రకారం, ఇంట్లో మురికిని ఉంచితే, లక్ష్మీదేవి ఎప్పుడూ దరికి చేరదు. అలాంటి పరిస్థితిలో అనవసరమైన ఖర్చులు పెరగడం, విభేదాలు తలెత్తడం వంటివి జరుగుతాయి.

వ్యర్థాలను వదిలేయడం..

ఇంటిలో ఏ మూల కూడా చెత్తను వదిలేయకూడదు. ఒకవేళ ఉంచినట్లయితే.. ప్రతికూల ప్రభావం తగ్గడమే కాకుండా ఆర్థిక సంక్షోభం, కష్టాలు తలెత్తే పరిస్థితులు నెలకొంటాయి. తుప్పుపట్టిన ఇనుము లేదా ఫర్నీచర్‌కు అంటిన చెత్తను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో కష్టాలు, వివాదాలు తలెత్తుతాయి. అందుకే ఇంట్లోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..