Moral Values: మనిషి జీవితంపై సాంగత్యం ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి.. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఏమి చేయాలంటే..

Teaching Moral Values: మనిషికి సాంగత్యం ప్రభావంతోనే ఒక సమస్య కలిగినా.. ఒక మంచి స్టేజ్ కు వెళ్లడం జరుగుతాయి. మన చుట్టూ ఉండే వారి స్వభావాలు,..

Moral Values: మనిషి జీవితంపై సాంగత్యం ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి.. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఏమి చేయాలంటే..
Moral Stories

Teaching Moral Values: మనిషికి సాంగత్యం ప్రభావంతోనే ఒక సమస్య కలిగినా.. ఒక మంచి స్టేజ్ కు వెళ్లడం జరుగుతాయి. మన చుట్టూ ఉండే వారి స్వభావాలు, మన కాలక్షేపాల లక్షణాలు మన ఆలోచనలపై ప్రభావం చూపిస్తాయి. ఆవేదననో.. లేదా ఆనందాన్నో పెంచుతాయి. అనుకోని ప్రతికూల ఘటన ఎదురైనప్పుడు మనస్సు కృంగి పోవడం సహజం. అటువంటి ససమయంలో మనం చదివే పుస్తకం, వినే సంగీతం, చూసే దృశ్యం మనసుకు ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉండాలి. అప్పుడు విపరీత భావాలు కలుగకుండా నిలదొక్కుకోగలం. ధర్మాన్ని బోధించేవీ, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి, జీవిత సత్యాన్ని తాత్వికంగా చెప్పేవి, ధైర్యాన్ని ఇచ్చే ‘సాంగత్యాలు’ ఎప్పుడూ మనిషిని ముందుకు నడిపిస్తాయి. ప్రపంచం చాలా పెద్దది.. జీవితం అనేకావకాశాలమయం. అయితే ఆ అవకాశాలు మన బుద్ధి విశాలతను పెంచుకున్న సమయంలో గోచరిస్తాయి.

చాలామంది ఒక్క చిన్న అవకాశం చేజారగానే దిగులు పడిపోయి.. బ్రతుకంతా శూన్యమనుకుంటారు. ఒక్క కష్టానికి జీవితం లో ఇంకేమీలేదు.. అంతా అయిపోయింది అనుకుంటారు. అటువంటి స్టేజ్ లో ఆత్మహత్యలకి పాల్పడే వారెందరో.. అలా దిగులుగా ఉన్న సమయంలో మనసుకు ప్రశాంతత చేకూర్చే మంచి కథలను పురాణ కథలను చదవడమే.. గురూపదేశాన్ని వినడమే.. వివేకానందుని వంటి మహావ్యక్తుల మాటలో, మహాత్ముల జీవిత ఘట్టాలో మన ఆలోచనల్లో ప్రవేశిస్తే కొత్త ఉత్తేజం, బలం సమకూరతాయి. కొండంత సమస్యనైనా దూదిపింజలా తీసుకోగలిగే మనసుకు ప్రశాంత ఏర్పడుతుంది. మంచి సాహిత్య సంగీతం ఒక మాధుర్యాన్ని, ఉపశమనాన్ని కలిగించడమే కాదు.. అంతరంగానికి కొత్త ఆలోచనల్నీ, ఆశావాదాన్నీ, జీవిత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అలాంటి గ్రంథాలను, కళలను, ధార్మికోపదేశాలను నిరంతరం ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ, ఆచరణలో పది మందికీ పనికొచ్చేలా మసలుకొనేవాడు నిత్యోత్సాహి.. చైతన్యశీలుడు. అలా ఆస్వాదించే పరిస్థితులనే ‘సత్సంగం’ అనాలి.

వ్యర్ధంగా కాలం గడుపుతూ, వ్యసనాలు ఉన్నవాడ, ఏ పని చేయకుండా బలాదూర్ గా తిరిగేవాడు ప్రతి పనిని ప్రతికూలంగానే చూస్తాడు. ఎవరినీ క్షమించలేడు, ఆదరించలేడు. సందేహాలతో జీవిస్తాడు. స్వార్ధం కోసమే చూస్తాడు. కేవలం ధనార్జనే లక్ష్యంగా ఉన్న వారంతా ఆ సత్సంగాన్నీ, జీవన మాధుర్యాన్ని కోల్పోతారు. రోజులో కొంతసేపైనా ఏ మంచి పుస్తకాన్నో వ్యక్తిత్వ నిర్మాణం చేసే వాటినో చదువుకోవాలి. ధర్మం కోసం స్వార్ధాన్ని త్యాగం చేయగలిగే వ్యక్తిత్వ వికాసాన్నిచ్చే సంప్రదాయ గ్రంథాలనే అధ్యయనం చేయాలి. అలా వికసించిన వ్యక్తిత్వం ఎలాంటి సంఘటనాంశానైనా ఎదుర్కోగలిగే పటుత్వాన్నిస్తుంది. గొప్ప వ్యక్తిత్వమున్న మహాత్ముల మాట విన్నా, వారితో పాటు కలిసి ఉన్నా అవి కూడా మన ఆలోచనలపై, జీవిత దృక్పథంపై ప్రభావం చూపిస్తాయి.

వనవాస సమయంలో మార్కండేయ, బృహదశ్వ, నారద, వ్యాసాది మహర్షుల సాంగత్యం లభించడం వలన ధర్మరాజు దైర్యంగా ధర్మబద్ధంగా దృఢంగా ఉండగలిగాడు. సోమరితనం లేకుండా, ప్రతికూల ధోరణులు లేని విధంగా వ్యక్తిత్వాన్ని పదిలపరచుకున్నాడు. అందుకే అంతిమంగా విజయం అందుకున్నాడు. అశోక వనంలో సీతమ్మ నిరాశకులోనై నిరాసక్తతలో ఉన్నప్పుడు మహాసత్పురుషుడైన హనుమంతుడు.. ఆయన మాటలలోని ధార్మికత, సత్యదర్శనం, తత్త్వవివేచన, ధైర్యాన్ని, బలాన్నిచ్చాయి. ఓదార్పునిచ్చాయి. సమస్యనెదుర్కొనగలిగే స్థిమితాన్ని ప్రసాదించాయి. ‘సత్సంగత్వేనిస్సంగత్వం’ అనే మాట ఆధ్యాత్మిక వాణియే కాదు నిత్య జీవననాదం కూడా. ‘సత్సంగాన్నే సమకూర్చుకోవాలి’ అంటూ నారదుడు – ‘తదేవ సాధ్యతామ్’ అనే రెండు మార్లు నొక్కి చెప్పాడు. అంతేకాదు దుస్సంగాన్ని విడిచి పెట్టాలి అని స్ఫుటంగా బోధించాడు. దుర్జన, దుర్విషలు, సాంగత్యాలు విడిచి పెట్టడం ప్రధాన సాధన. చెడును విడిచిపెడితే ఆ ప్రాంతంలో, ఆ కాలంలో మరో మంచి విషయాన్ని వినడమో, చదవడమో, గ్రహించడమో చేయగలం. సత్సాంగత్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు, దుస్సాంగత్యాన్ని కూడా వదులుకోమని గీతాచార్యుడే గీతలో సెలవిచ్చాడు. ఒక్కమంచి మాటతో మంచి బాటలోకి మలుపు తిరిగిన జీవితాలెన్నో.. వాటిని గమనిస్తే జీవితం కంటే, గొప్ప అద్భుతం లేదని స్పష్టమౌతుంది.

Also Read:

ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్‌..

Click on your DTH Provider to Add TV9 Telugu