Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అప్పగింతల్లో ఏడవకుండా, ఫుల్ ఖుషీగా వధువు.. ఆమె చెప్పిన రీజన్ వింటే షాక్ తినాల్సిందే

సాధారణంగా పెళ్లి తంతు అంటేనే ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ముఖ్య ఘట్టాలు ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా జీలకర్ర-బెల్లం, తాళికట్టు సమయం, అప్పగింతలు ఉంటాయి.

Viral Video: అప్పగింతల్లో ఏడవకుండా, ఫుల్ ఖుషీగా వధువు.. ఆమె చెప్పిన రీజన్ వింటే షాక్ తినాల్సిందే
Bride Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 28, 2021 | 7:05 PM

సాధారణంగా పెళ్లి తంతు అంటేనే ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ముఖ్య ఘట్టాలు ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా జీలకర్ర-బెల్లం, తాళికట్టు సమయం, అప్పగింతలు ఇలా అనేకం. ఇందులో తాళికట్టు సమయం చాలా ప్రధానమైనది…అప్పగింతలు కూడా మరో ప్రధాన ఘట్టం. ఈ సమయంలో అందరూ పెళ్లి కుమార్తె.. ఆమె కుటుంబం తీవ్ర భావోద్వేగంలో ఉంటుంది. పెళ్లి తర్వాత అమ్మాయిని వరుడు కుటుంబానికి వధువు తల్లిదండ్రులు అప్పగించే తంతే ఇది. ఈ సందర్భంలో వధువు కుటుంబ సభ్యులు అందరు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. గారాబంగా పెంచుకున్న తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే కాస్త సర్దుకుపోవాలి అంటూ తల్లిదండ్రులు వధువును, వరుడు కుటుంబానికి అప్పగిస్తూ ఉంటారు. కన్నవారిని విడిచిపెట్టి అత్తింటికి వెళ్లాలంటే..అమ్మాయి కూడా అంతే దుఃఖంతో విలపిస్తుంది. అమ్మనాన్నలను, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులను పలకరిస్తూ బోరున ఏడ్చేస్తుంటారు. అయితే, ఇక్కడో నవ వధువు మాత్రం అప్పగింతల వేళ ఎంతో విచిత్రంగా ప్రవర్తించింది. కన్నీళ్లను ఆపుకుంటూ..ముఖంపై చిరునవ్వును ప్రదర్శిస్తూ..అందరితో చలాకీగా ప్రవర్తించింది. తన తల్లిని కూడా నవ్వుతూ ఉండాలని చెప్పింది. అయితే, దీనివెనకాల అసలు కారణం తెలిసి అంతా విస్తుపోయారు.

ఆ వధువు అలా ప్రవర్తించటానికి ఆమె వేసుకున్న మేకప్‌ రీజన్ అని చెప్పింది. ఏడిస్తే..ఎక్కడ మేకప్‌ పాడవుతుందోనని ఏడవటం మానేసిందట. తనను ఫోటోలు తీస్తారు కాబట్టి.. ఏడిస్తే మేకప్ చెరిగిపోతుందని భావించిందట. అందుకే అమ్మను కూడా ఏడవద్దని చెబుతూ..కన్నీళ్లు తుడుస్తూ..కారెక్కి అత్తరింటికి బయల్దేరింది. మొత్తానికి వీడియో మాత్రం సోషల్‌ మీడియా వేదికగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సదరు వీడియోపై మీరు ఓ లుక్కేయండి. ఆమె తన కుటుంబ సభ్యులను ఏడిపించకూడదనే అలా చేసిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Also Read:Viral News: కాటేసిన పాముతో ఆస్పత్రికి.. డాక్టర్లు, రోగులు షాక్.. అక్కడ్నుంచి పరార్

మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కార్… ప్రతి గ్రామానికి ఉచితంగా ట్రాక్టర్‌..!