Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కార్… ప్రతి గ్రామానికి ఉచితంగా ట్రాక్టర్‌..!

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Andhra Pradesh: మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కార్... ప్రతి గ్రామానికి ఉచితంగా ట్రాక్టర్‌..!
Free Tractor To Every Village
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 28, 2021 | 6:44 PM

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్‌ ద్వారానే నీటి తడులు అందించేందుకు ఈ ట్రాక్టర్లు వినియోగించేలా ఆలోచనలు చేస్తోంది. ఈ ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయ భారం సదరు గ్రామ పంచాయతీలపై పడకుండా ప్రభుత్వం మార్గాలను విశ్లేషిస్తుంది. రాష్ట్రంలో 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5 వేల పైచిలుకు ఉన్నాయి. వీటికి సొంత ట్రాక్టర్లు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. ఇవికాక 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని పంచాయతీలు 91 ఉన్నాయి. ఆయా పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 5,228 గ్రామాలకు ఉచితంగా కొత్తగా ట్రాక్టర్లు అంజేయాలన్నది ప్రభుత్వ యోచన. గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా ఈ ట్రాక్టర్లను వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

పంచాయతీలపై ట్రాక్టర్ల భారం పడకుండా చర్యలు…

రోడ్ల పక్కన నాటే మొక్కలకు  నీటి తడులు ఇవ్వడానికి గాను నాటిన ప్రతి మొక్కకు రెండేళ్లలో రూ.280 చొప్పున ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు చెల్లిస్తోంది. ఇలా 400 మొక్కలు ఒక యూనిట్‌గా చేసుకుని ప్రతి యూనిట్‌కు రూ.1.12 లక్షల చొప్పున ఇస్తోంది. ఇకపై మొక్కలకు నీటి తడులు ఇచ్చే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గ్రామ పంచాయతీలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఆ డబ్బు పంచాయతీకి వస్తుంది. ఈ డబ్బుతో ట్రాక్టర్‌ డీజిల్, డ్రైవర్, మరమ్మతు ఖర్చులకు వినియోగించుకునే వీలుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ‘అమ్మ ఒడి’ డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే… ఏపీ సర్కార్ కొత్త షరతు

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ… ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్