Guntur District: వీడు మాములు దొంగ కాదు.. పోలీసులకు దొరక్కుండా ఏకంగా 6 గంటలు చెరువులోనే
మీరు ఇప్పటివరకు ఎంతో మంది దొంగల్ని చూసుంటారు. పిక్ పాకెటర్స్ నుంచి గజ దొంగల వరకు కథకథలుగా వినుంటారు. కానీ ఇతడు మాత్రం పూర్తి డిఫరెంట్.
మీరు ఇప్పటివరకు ఎంతో మంది దొంగల్ని చూసుంటారు. పిక్ పాకెటర్స్ నుంచి గజ దొంగల వరకు కథకథలుగా వినుంటారు. కానీ, ఇప్పుడు మేం చెప్పబోయే దొంగను మాత్రం ఇప్పటివరకు అస్సలు చూసుండరు. ఈ దొంగ అలాంటిలాంటోడు కాదు. గజ దొంగలకే దొంగ వీడు. పోలీసులకే టెర్రర్ పుట్టించగల దమ్మున్నోడు. వీడ్ని పట్టుకోవడం ఆషామాషీ కాదు. కళ్ల ముందే కనిపిస్తాడు కానీ పట్టుకోలేరు. ఈ దొంగ పేరు భరత్. ఉండేది గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్. ఈ దొంగకు ఎందుకంత సీన్, హైప్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మీరే ఒప్పుకుంటారు. మేం చెప్పిందంతా నిజమే అంటారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌లో చోరీకి పాల్పడుతూ బాధితుల కంటపడ్డాడు ఓ వ్యక్తి. దొంగ ఎవరో గుర్తించిన బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దొంగను అరెస్ట్ చేసేందుకు గ్రామంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పోలీసులకు దొరక్కుండా చెరువులోకి దూకేశాడు. నిమిషం కాదు, ఐదు నిమిషాలు కాదు… ఏకంగా ఐదు గంటలపాటు చెరువులోనే ఈదుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఈ సీన్‌ని చూసేందుకు గ్రామస్తులంతా చెరువు చుట్టూ చేరారు. బైక్స్‌పై చెరువు దగ్గరకు చేరుకుని సినిమా చూసినట్టు చూశారు. గంట కాదు… రెండు గంటలు కాదు… ఐదారు గంటలపాటు పడిగాపులు పడినా దొంగను పట్టుకోలేకపోయారు పోలీసులు. అలసిపోయి బయటికి వస్తే పట్టుకుందామని చూసినా పోలీసులకు నిరాశే ఎదురైంది. చాకచక్యంగా చెరువులో నుంచి బయటికి వచ్చిన దొంగ… పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు.
Also Read: ‘అమ్మ ఒడి’ డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే… ఏపీ సర్కార్ కొత్త షరతు
విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ… ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్