Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real time graphics Video: కరోనా ఆంక్షలు.. బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి.. ఓ మైండ్‌ బ్లోయింగ్‌ ఐడియా..! టెక్నాలజీ ఈ రేంజ్ లో వాడతారా..(వీడియో)

Real time graphics Video: కరోనా ఆంక్షలు.. బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి.. ఓ మైండ్‌ బ్లోయింగ్‌ ఐడియా..! టెక్నాలజీ ఈ రేంజ్ లో వాడతారా..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 29, 2021 | 5:06 PM

ఓపక్క కరోనా ఆంక్షలు.. మరో పక్క స్నేహితురాలి పెళ్లి.. అందులోనూ తోడి పెళ్లికూతురి బాధ్యతలన్నీ తనవే.. ఏం చేయాలి..? ఎలా వెళ్లాలి... ఇలా ఆలోచిస్తున్న ఓ యువతిని టెక్నాలజీ గట్టెక్కించింది. ప్రత్యక్షంగా పెళ్లికి వెళ్లలేకపోయినా, తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తించింది..


ఓపక్క కరోనా ఆంక్షలు.. మరో పక్క స్నేహితురాలి పెళ్లి.. అందులోనూ తోడి పెళ్లికూతురి బాధ్యతలన్నీ తనవే.. ఏం చేయాలి..? ఎలా వెళ్లాలి… ఇలా ఆలోచిస్తున్న ఓ యువతిని టెక్నాలజీ గట్టెక్కించింది. ప్రత్యక్షంగా పెళ్లికి వెళ్లలేకపోయినా, తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తించింది.. స్నేహితురాలిని ఆశీర్వదించింది. ఇందుకోసం వేరే వ్యక్తిని కూడా పంపలేదు. తానే స్వయంగా పూర్తి చేసింది. అది కూడా పెళ్లి ముహుర్తానికి, పెళ్లి మండపంలోనే. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా! వర్చువల్‌ టెక్నాలజీనీ ఉపయోగించి, పెళ్లితెరపై ప్రత్యక్షమైంది. ఎలాగనుకుంటున్నారా? హోలోగ్రామ్‌ రూపంలో.. సింపుల్‌గా చెప్పాలంటే రియల్‌ టైమ్‌ వర్చువల్‌ గ్రాఫిక్స్‌ అన్నమాట.

ఈ టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడ ఉన్నా మన ప్రతిరూపాన్ని కావాలనుకున్న చోట ప్రత్యక్షం చేసేదే ఈ హోలోగ్రామ్‌. రజనీకాంత్‌ రోబో సినిమా చూసి ఉంటే మీకు వెంటనే ఇది అర్థమైపోతుంది. సినిమాలో ఫ్రొఫెసర్‌ బోరాను వశీకరణ్‌ తన ల్యాబ్‌లోకి అనుమతించడు. దీంతో బోరా తన వర్చువల్‌ బాడీని చిట్టీ ముందు ప్రత్యక్షం చేసి, మాట్లాడతాడు. సేమ్‌ ఇలాగే.. కరోనా ఆంక్షల కారణంగా లండన్‌కు చెందిన బీమ్‌ కెనడాలో జరిగే తన స్నేహితురాలి అంటారియా పెళ్లికి వెళ్లలేకపోయింది. తనను నమ్మి తోడిపెళ్లికూతురు బాధ్యతలు అప్పగించిన స్నేహితురాలిని బాధ పెట్టడం ఇష్టం లేక, హోలోగ్రామ్‌ ద్వారా పెళ్లిలో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఒక తోడిపెళ్లికూతురుగా వరుడికి వధువు గురించి చెప్పాల్సిన విషయాలన్నీ అందంగా వివరిస్తూ, ఆశ్చర్యపరచింది. తర్వాత అందరితో పాటు డ్రింక్‌ తాగుతూ, కాసేపు డాన్స్‌ చేసింది. ఇక చివరగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అంతర్ధానమైంది. ఇదంతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కుంటిసాకులు చెప్పి, తప్పించుకునే ఫ్రెండ్స్‌ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్‌ దొరకడం నిజంగా పెళ్లికూతురి ఆదృష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Big News Big Debate: KCR ప్రభుత్వంపై కుట్ర నిజమేనా.? పంటకొనొద్దని చెప్పిన కేంద్రం లేఖ నిజం కాదా.?(లైవ్ వీడియో)

Tirupati Rain: తిరుపతిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. నీళ్లలో నిల్చిపోయిన వాహనం ఊపిరాడక యువతి మృతి..(వీడియో)