AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కాటేసిన పాముతో ఆస్పత్రికి.. డాక్టర్లు, రోగులు షాక్.. అక్కడ్నుంచి పరార్

అదో ప్ర‌భుత్వాసుపత్రి. రోగుల‌తో కిట‌కిట‌లాడుతోంది. అక్క‌డి వైద్యుడు రోగుల‌ను చూడ‌డంలో బిజీగా ఉన్నాడు. ఇంత‌లో అక్కడ ఊహించని ఇన్సిడెంట్ జరిగింది.

Viral News: కాటేసిన పాముతో ఆస్పత్రికి.. డాక్టర్లు, రోగులు షాక్.. అక్కడ్నుంచి పరార్
Snake Hulchal
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2021 | 6:33 PM

Share

అదో ప్ర‌భుత్వాసుపత్రి. రోగుల‌తో కిట‌కిట‌లాడుతోంది. అక్క‌డి వైద్యుడు రోగుల‌ను చూడ‌డంలో బిజీగా ఉన్నాడు. ఇంత‌లో ఓ మహిళ అక్క‌డి వ‌చ్చింది. డాక్ట‌ర్ గారు ఈ పామే నా కూతుర్ని కాటేసింద‌ని చెబుతూ..తాను చేతిలో ప‌ట్టుకువ‌చ్చిన పామును చూపించింది. అంతే.. అక్క‌డే ఉన్న డాక్ట‌ర్‌తో పాటు అక్క‌డి రోగులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఆమె చేతిలో ఓ చిన్న సైజు కట్ల పాము కనిపించింది..అది ఇంకా బ‌తికే ఉండ‌డంతో దాన్ని చూసిన కొంద‌రు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న కర్ణాటక రాష్ట్రంలో జ‌రిగింది.

కర్ణాటకలోని డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి కూతురు ఐదేళ్ల సంచనశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్న సైజు కట్ల పాము కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. వెంటనే పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు…పాపను ఇదే పాము కాటేసిందని వైద్యులకు చూపించారు. మహిళ చేతిలోని పామును చూసి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. కానీ, సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు. కాగా కాటేసిన పాము ఏదో తెలిస్తే.. వైద్యం చేయడం సులభమవుతోంది. అందుకే అలా పామును తీసుకొచ్చినట్లు మణి తెలిపింది.

Also Read: మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కార్.. ప్రతి గ్రామానికి ఉచితంగా ట్రాక్టర్‌..!

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ… ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే