Bheemla Nayak: భీమ్లా నాయక్ ఆప్డేట్.. డానియల్ శేఖర్‌కు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్నారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ ఆప్డేట్.. డానియల్ శేఖర్‌కు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ..
Actress Samyuktha Menon
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2021 | 9:03 PM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అలాగే మరో పవర్ ఫుల్ పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్స్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ కళ్యాణ్, రానాకు సంబంధించిన టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లాయి.

వచ్చేనెలతో భీమ్లానాయక్ షూటింగు పార్టు కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ నటించనుంది. తాజాగా సంయుక్త ఈ సినిమాలో నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన  భీమ్లానాయక్ సినిమాను విడుదల చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aha: కొత్త వెబ్‌ సీరీస్‌తో ప్రేక్షకులను అలరించనున్న ఆహా.. ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ డ్రామాగా ‘అల్లుడు గారు’

Samantha: తన సోషల్ మీడియా ఖాతాల నుంచి చైతూ ఫోటోలు డిలీట్ చేసిన సమంత

Naga Shaurya: ప్రతి ఇంట్లో చూసే కథే మా వరుడు కావలెను సినిమా: హీరో నాగశౌర్య

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!