Telangana: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా.?

అసెంబ్లీకి కేసీఆర్ రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి అడుగుపెట్టడం మాత్రం మొదటిసారి. ఉద్యమ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగాలను చాలామంది విన్నారు. ఆయన ప్రసంగాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉండేవి. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లపాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు.

Telangana: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా.?
Kcr
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 24, 2024 | 8:28 PM

అసెంబ్లీకి కేసీఆర్ రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి అడుగుపెట్టడం మాత్రం మొదటిసారి. ఉద్యమ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగాలను చాలామంది విన్నారు. ఆయన ప్రసంగాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉండేవి. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లపాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు. కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శస్త్రాలు స్పందిస్తారనేది చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికితోడూ గత అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావటం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను స్వీకరించి ఆయన అసెంబ్లీకి హాజరవ్వాలని కోరుకుంటున్నట్లు సెటైర్లు కూడా వేశారు.

పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని మంత్రులు కూడా ప్రశ్నించారు. అయితే అప్పుడు ఆరోగ్య కారణాలతో ఆయనే సమావేశాలకు హాజరు కాలేదు. ఆ తర్వాత ప్రెస్ మీట్‎లో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ చెప్పారు. తాజాగా కెసిఆర్ జూలై 25న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నట్లుగా పార్టీ ప్రకటించింది. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయి. మామూలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే.. కాంగ్రెస్ పూర్తిగా కేసీఆర్‎ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తుందని బిఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఇందుకోసమే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి.. తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న ఆయన అసెంబ్లీలో ఎలాంటి అవమానాలకు గురి కావొద్దు అనేది పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసమే చర్చలు ఉన్న రోజు కాకుండా.. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ హాజరయ్యేలా ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. బడ్జెట్ ప్రవేశపెట్టి రోజున ఎలాంటి చర్చలు ఉండవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశ పెడుతూ చేసే ప్రసంగం తప్ప ఇక ఎలాంటి ఇతర వ్యాఖ్యానాలు ఉండవు. అందుకోసమే ఈ రోజును అసెంబ్లీ హాజరయ్యేందుకు కేసీఆర్ ఎంచుకున్నారని సమాచారం. అయితే ఆ తర్వాత కూడా సమావేశాలకు రావడం కంటిన్యూ చేస్తారా.. లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..