AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: బర్త్ డే సందర్భంగా మానవత్వం చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..

తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.

KTR: బర్త్ డే సందర్భంగా మానవత్వం చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..
Ktr
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Jul 24, 2024 | 9:50 PM

Share

తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల విద్యా, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ విద్యార్థుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోం‎లో ఉన్న 100 మంది విద్యార్థినిలకు ల్యాప్‎టాప్‎‎లను అందజేశారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు ల్యాప్‎టాప్‎లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

2020 లో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ఏటా కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తున్నారు. గత ఐదేళ్లలో పలు అంబులెన్స్‎లతో 6,000 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్ పరికరాలను అందజేశారు. 1400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగానే స్టేట్ హోమ్ విద్యార్థులకు ల్యాప్‎టాప్‎లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కానీ ఎన్నికల వలన అది సాధ్యం కాలేదని అన్నారు. గతేడాది ఇచ్చిన హామీ ఈ ఏడాది నెరవేర్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఐదేళ్లు తాను చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో మనసుకి సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‎తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..