Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే..
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీగా కేటాయింపులు చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ. 9151 కోట్లు కేటాయించగా.. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.5336 కోట్లు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీగా కేటాయింపులు చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ. 9151 కోట్లు కేటాయించగా.. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.5336 కోట్లు కేటాయించింది. ఏపీలో రైల్వే లైన్ల 100 శాతం విద్యుదీకరణ పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా ఏపీలో 73 స్టేషన్ల ఆధునీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రైల్వేలకు కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2024-25 రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపుల గురించి వివరించడంతోపాటు.. గతంతో పోల్చుకుంటే భారీగా నిధులను కేటాయించినట్లు వివరించారు. ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలకు రూ. 2024-25 సంవత్సరానికి 2,62,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైల్వేలను ప్రపంచ స్థాయికి చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రైల్వేలో భద్రత సంబంధిత కార్యకలాపాలకు గణనీయంగా 1.09 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో 73 స్టేషన్లు..
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ. 2024-25 సంవత్సరానికి 9,151 కోట్లు అని చెప్పిన అశ్విని వైష్ణవ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2009-14 సంవత్సరాల్లో వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ. 886 కోట్లే అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్ కేటాయింపులు 2009-14 మధ్య కాలంలో చేసిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు పది రెట్లు పెరిగాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అన్నారు. 2009-14లో కేవలం 73 కిలోమీటర్లతో పోలిస్తే గత పదేళ్లలో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 151 కిలోమీటర్ల (సంవత్సరానికి సగటున) కొత్త రైల్వే ట్రాక్‌లు వేశారని ఆయన పేర్కొన్నారు. భద్రతను సులభతరం చేసేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఏపీ రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లు..
తెలంగాణ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికిగాను రూ.5,336 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. గతంతో పోల్చుకుంటే. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు నిరంతరాయంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనులు మొత్తం వ్యయం రూ . 32,946 కోట్లు కాగా, రైల్వే నెట్‌వర్క్ 100% విద్యుదీకరణ అయిందని తెలియజేసారు. 2009-2014 లో కేవలం 17 కిలోమీటర్ల ట్రాక్ వేయగా గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సగటున సంవత్సరానికి 65 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ వేశామని చెప్పారు. గత పదేళ్లలో 437 ఆర్ఓ బి లు, ఆర్యూబిలు నిర్మించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్‌లను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పునరాభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..