Tea Market in India: రంగు, రుచి, చిక్కదనం.. దీంతోపాటే వ్యాపారం.. మన టీ పరిశ్రమ విజయ రహస్యం ఏమిటి!
ఉదయం నిద్ర లేవడంతో మొదలవుతుంది. రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగుతుంది. నాలిక మీద ఆ తేనీటి చుక్క పడనిదే.. కాలు కదలదు. మెదడు పనిచేయదు. ఇంకా చెప్పాలంటే అసలేమీ తోచదు. అదే టీ మహిమ. సేవించేవారికి ఇది చక్కటి పానీయం. మన దేశంలో టీ మార్కెట్ చిన్నదేమీ కాదు.

ఉదయం నిద్ర లేవడంతో మొదలవుతుంది. రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగుతుంది. నాలిక మీద ఆ తేనీటి చుక్క పడనిదే.. కాలు కదలదు. మెదడు పనిచేయదు. ఇంకా చెప్పాలంటే అసలేమీ తోచదు. అదే టీ మహిమ. సేవించేవారికి ఇది చక్కటి పానీయం. మన దేశంలో టీ మార్కెట్ చిన్నదేమీ కాదు. Tea Market In India 1 ప్రపంచంలో అత్యధికంగా టీని ఉత్పత్తి చేసే దేశాల్లో మన దేశానిది రెండో స్థానం. కాకపోతే మనం ఉత్పత్తి చేసే టీలో దాదాపు 80 శాతం దేశీయ అవసరాలకే వినియోగిస్తాం. దాదాపు 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో కాఫీతో పోలిస్తే.. టీ వినియోగం ఎక్కువ. దాదాపుగా ప్రతీ ఇంటిలోనూ ఛాయ్ ప్రియులు ఉంటారు. రోజూ టీ తాగనిదే చాలామంది ఉండలేరు. నిత్యజీవితంలో వీరికి ఇది ఓ భాగంగా ఉంటుంది. మన దేశంలో సగటున ఒక్కొక్కరూ రోజుకు 3 కప్పుల టీని తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశ జనాభాలో దాదాపు 64 శాతం మంది టీ తాగుతున్నారని అంచనా. నిజానికి కాఫీతో పోలిస్తే టీ తాగేవారే మన దగ్గర ఎక్కువగా ఉంటారు. అందుకే ఇది సామాన్యుడి ఛాయ్ అని అంటారు. Tea Market In India 2 మన టీ మార్కెట్ ఎంత పెద్దది అంటే.. ఇంటి అవసరాలకు ఉపయోగించే తేయాకు ఉత్పత్తి ద్వారా జరిగే బిజినెస్...




