Gold Price Today: బడ్జెట్‌ దెబ్బతో భారీగా తగ్గిన బంగారం ధర.. గోల్డ్‌ కొనేందుకు ఇదే సరైన సమయం

ఒకానొక సమయంలో తులం గోల్డ్‌ రూ. 80 వేలు దాటి రూ. లక్షకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే బడ్జెట్‌లో బంగారంపై ట్యాక్స్‌ తగ్గించిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. రానుంది పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ప్రియులకు ఇది మంచి ఉపశమనంగా భావించొచ్చు. కాగా గురువారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది...

Gold Price Today: బడ్జెట్‌ దెబ్బతో భారీగా తగ్గిన బంగారం ధర.. గోల్డ్‌ కొనేందుకు ఇదే సరైన సమయం
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 25, 2024 | 6:34 AM

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బహుశా ఇదే సరైన సమయంగా చెప్పొచ్చు. మొన్నటి వరకు ఆకాశన్నంటిన గోల్డ్‌ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇదంతా తాఆజగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఫలితమే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి 10 గ్రాముల గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 4 వేలు తగ్గడం విశేషం. దీంతో తులం బంగారం ధర రూ. 70 వేలకు చేరింది.

ఒకానొక సమయంలో తులం గోల్డ్‌ రూ. 80 వేలు దాటి రూ. లక్షకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే బడ్జెట్‌లో బంగారంపై ట్యాక్స్‌ తగ్గించిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. రానుంది పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ప్రియులకు ఇది మంచి ఉపశమనంగా భావించొచ్చు. కాగా గురువారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మరి నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,090గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,000 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850కి చేరింది.

* చైన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,790 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో గురువాం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,940గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,850 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర రూ. 64,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా ఉంది.

* ఇక సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,940 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. గురువారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 87,400కి చేరింది. అలాగే హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన