3.5 Lakhs Net Worth: రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
ధనం మూలం ఇదం జగత్ అనే విషయం అందరికీ తెలిసిందే. మన దగ్గర ఉండే డబ్బుకు అనుగుణంగానే సమాజంలో మన విలువ ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ప్రజలు సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచ జనాభాలో టాప్ 10 శాతంలో ఉండాలంటే ఎంత డబ్బు అవసరమో? ఎప్పుడైనా ఆలోచించారా..? తాజాగా క్రెడిట్ సూయిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు సంబంధించిన 2018 గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 90 శాతం మంది ప్రజల కంటే ధనవంతులుగా ఉండటానికి 93,170 డాలర్లు అంటే రూ. 77,98,110 నికర విలువ సరిపోతుంది.
ధనం మూలం ఇదం జగత్ అనే విషయం అందరికీ తెలిసిందే. మన దగ్గర ఉండే డబ్బుకు అనుగుణంగానే సమాజంలో మన విలువ ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ప్రజలు సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచ జనాభాలో టాప్ 10 శాతంలో ఉండాలంటే ఎంత డబ్బు అవసరమో? ఎప్పుడైనా ఆలోచించారా..? తాజాగా క్రెడిట్ సూయిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు సంబంధించిన 2018 గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 90 శాతం మంది ప్రజల కంటే ధనవంతులుగా ఉండటానికి 93,170 డాలర్లు అంటే రూ. 77,98,110 నికర విలువ సరిపోతుంది. ఈ రిపోర్ట్ ఆస్తుల నికర విలువ అనేది ఆర్థిక ఆస్తుల విలువతో పాటు గృహాల యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ ఆస్తులు గణించి అందులోని వారి అప్పులను మినహాయిస్తే నికర విలువ కింద లెక్కగట్టి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న 50 శాతం మంది ప్రజలకంటే మనం ధనవంతులు కావాలంటే నికర విలువ ఎంతో? ఓ సారి తెలుసుకుందాం.
క్రెడిట్ సూయిస్ నివేదిక ప్రకారం యూఎస్‌లో 102 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 శాతంలో ఉన్నారు. ఇది ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ. గ్లోబల్ 50 శాతంలో ఉండాలంటే మీ వద్ద కేవలం 4,210 డాలర్లు అంటే రూ. 3,52,367 ఉంటే, మీరు ఇప్పటికీ ప్రపంచ జనాభాలో సగం కంటే ధనవంతులుగా ఉంటారని నివేదిక వెల్లడించింది. అలాగే మీరు ప్రపంచంలో 1 శాతం ధనవంతుల్లా ఉండటానికి 8,71,320 డాలర్లు అంటే రూ. 7,29,27,436 నికర విలువైన ఆస్తి ఉండాలి. ఇలా గ్లోబల్ స్థాయిలో కూడా 19 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉన్నారని క్రెడిట్ సూయిస్ నివేదించింది. ఈ సంఖ్యలు నిరంతర సంపద అసమానతకు సంబంధించిన తీవ్ర స్థాయిని ప్రతిబింబిస్తాయి. మొత్తం సంపదలో అట్టడుగు సగం మంది సమిష్టిగా 1 శాతం కంటే తక్కువ కలిగి ఉండగా ధనవంతులైన వారి వద్దే ప్రపంచ సంపదలో 85 శాతం ఉంది.
చాలా మంది సంపన్నులు, సంపన్న దేశాలలో ఆర్థిక సంపద వాటా 2015లో గరిష్ట స్థాయికి చేరుకుంది. టాప్ డెసిలీ టాప్ 5 శాతం వాటా 2016లో అదే స్థాయిలో ఉంది. అయితే టాప్ 1 శాతం వాటా 47.5 శాతం నుంచి 47.2 శాతానికి పడిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి భవిష్యత్‌లో సంపద అసమానత తగ్గుముఖం పడే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..