Most Powerful Passports: ఆ పాస్ పోర్టు ఉంటే.. 195 దేశాల్లో మీకు తిరుగులేదు.. అంత పవర్ ఫుల్ అది..

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దానిలో ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్టుల వివరాలు తెలిపింది. వీసా లేకుండా ఒక పాస్ పోర్టు ద్వారా వెళ్లగలిగే దేశాల సంఖ్యను ఆధారంగా చేసుకుని ర్యాంకులు ఇచ్చింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఐ) నుంచి వచ్చిన డేటాపై ఆధారంగా మన పాస్ పోర్టుకు 82వ ర్యాంకు లభించింది.

Most Powerful Passports: ఆ పాస్ పోర్టు ఉంటే.. 195 దేశాల్లో మీకు తిరుగులేదు.. అంత పవర్ ఫుల్ అది..
World’s Powerful Passport
Follow us
Madhu

|

Updated on: Jul 24, 2024 | 3:17 PM

విమానాల్లో విదేశాలకు ప్రయాణం చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. చదువు కోసమో, ఉద్యోగం నిమిత్తమో, విహార యాత్రకనో అనేక మంది తమకు నచ్చిన దేశాలకు వెళుతున్నారు. వారందరికీ పాస్ పోర్టు అనేది చాలా కీలకం. ఇది మన దేశ పౌరులుగా గుర్తించే పత్రం అని చెప్పవచ్చు. మనకు దేశంలో ఆధార్ కార్డు ఎలాగో, విదేశాలకు వెళ్లేవారికి పాస్ పోర్టు అలాగే ఉపయోపడుతుంది.

పాస్ పోర్టుతోనే అనుమతి..

ప్రపంచంలో అన్ని దేశాలు తమ పౌరులకు పాస్ పోర్టులను జారీ చేస్తాయి. వాటి తో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. దేశ సరిహద్దును దాటి వేరే దేశానికి వెళ్లినప్పుడు దీన్ని తప్పనిసరిగా చూపించాలి. దాని ఆధారంగా ఆయా దేశాలు వీసాలను మంజూరు చేస్తాయి. పాస్ పోర్టు అనేది ఒక దేశం తమ పౌరులకు ఇచ్చే గుర్తింపు పత్రం. వీసా అంటే తమ దేశంలో పర్యటించడానికి ఆయా దేశాలు ఇచ్చే అనుమతి. కొన్ని దేశాల పాస్ పోర్టులు చాలా శక్తివంతంగా ఉంటాయి. వాటి ద్వాారా అనేక దేశాలలో సులభంగా పర్యటించవచ్చు.

మన ర్యాంకు ఎంత..

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దానిలో ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్టుల వివరాలు తెలిపింది. వీసా లేకుండా ఒక పాస్ పోర్టు ద్వారా వెళ్లగలిగే దేశాల సంఖ్యను ఆధారంగా చేసుకుని ర్యాంకులు ఇచ్చింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఐ) నుంచి వచ్చిన డేటాపై ఆధారంగా మన పాస్ పోర్టుకు 82వ ర్యాంకు లభించింది. మన పాస్ పోర్టుతో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ తదితర 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది.

అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు..

  • అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులలో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. దీని ద్వారా 195 దేశాలకు వీసా రహితంగా ప్రయాణం చేయవచ్చు.
  • ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాల పాస్ పోర్టులు రెండో స్థానంలో నిలిచాయి. వాటి ద్వారా 192 దేశాలలో పర్యటించవచ్చు.
  • ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్ పోర్టులు మూడో స్థానంలో నిలిచాయి. వీటి సాయంతో 191 దేశాలకు వెళ్లొచ్చు.
  • బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ నాలుగో ర్యాంకులో ఉన్నాయి. వీటి పాస్ పోర్టులతో 190 దేశాలకు వెళ్లొచ్చు.
  • ఆస్ట్రేలియా, పోర్చుగల్ ఐదోస్థానంలో కొనసాగుతున్నాయి. వీటి పాస్ పోర్టులతో 189 దేశాల్లో పర్యటించొచ్చు.
  • గ్రీస్, పోలాండ్ దేశాలు ఆరో ర్యాంకులో ఉన్నాయి. వీటి పాస్ పోర్టులతొ 188 దేశాలకు వెళ్లొచ్చు.
  • కెనడా, చెకియా, హంగరీ, మాల్టా ఏడో స్థానంలో నిలిచాయి. వీటి పాస్ పోర్టులతో 187 దేశాల్లో పర్యటించొచ్చు.
  • యునైటెడ్ స్టేట్స్  ఎనిమిదో స్థానంలో ఉంది. దీని పాస్ పోర్టుతో 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.
  • ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నాయి. వీటి పాస్ పోర్టులతో 185 దేశాల్లో పర్యటించొచ్చు.
  • ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా  తర్వాత స్థానాలలో నిలిచాయి. వీటి పాస్ పోర్టులతో 184 దేశాలకు వెళ్లొచ్చు.
  • పాకిస్తాన్ పాస్ పోర్టు 33 దేశాలకు అనుమతితో వందో స్థానంలో, చివరి ర్యాంకుపై ఆఫ్ఘనిస్తాన్ పాస్ పోర్టు ఉంది. దీని సాయంతో 26 దేశాలలో మాత్రమే పర్యటించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!