AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: బడ్జెట్ ఎఫెక్ట్… ఒక్కరోజులోనే భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బడ్జెట్ ఎఫెక్ట్... ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పతనం... అదే బాటలో వెండి ధర కూడా నేల చూపులు చూస్తోంది. పసిడి ప్రియులకి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకం తగ్గితే ఎవరికి లాభం? నేరుగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందా? వ్యాపారులకి మేలు చేస్తుందా?

Gold Rate: బడ్జెట్ ఎఫెక్ట్... ఒక్కరోజులోనే భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
Gold
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2024 | 3:26 PM

Share

గత ఏడాది భారత్‌ 744 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇప్పటిదాకా ఉన్న 15 శాతం ట్యాక్స్‌ను బట్టిచూస్తే.. అటూఇటూగా 2.8 లక్షల కోట్ల రూపాయల విలువ అన్నమాట. ఈ మొత్తంలో 40వేల కోట్ల రూపాయల మొత్తాన్ని దిగుమతి సుంకం రూపంలో భారత్‌ చెల్లించింది. ఇప్పుడు ఈ మొత్తంలో కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారంపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్‌లో 15 శాతం నుంచి 11 శాతానికి తగ్గించారు. ఇందులో వ్యవసాయ-మౌలిక రంగాల సెస్‌ 5 శాతంగా ఉంది. ఈ సెస్‌ కాకుండా బంగారంపై ఆరుశాతం కస్టమ్స్‌ డ్యూటీ ఇప్పుడు అమల్లోకి వస్తుంది. ఈ లెక్కన కస్టమ్స్‌ సుంకం తగ్గించిన తొలి ఫలితం బంగారం వర్తకులకు మేలు జరగనుంది.

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. గోల్డ్, సిల్వర్‌పై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6 శాతానికి తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4 శాతంగా ప్రకటించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో గోల్డ్ రేట్ భారీగా పడిపోయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ధర ఏకంగా 5.36 శాతం అంటే 3,897 తగ్గి 68,821 ధరకు పడిపోయింది. సిల్వర్ 4.21 శాతం అంటే 3,753 పడిపోయి 85,450 కి చేరుకుంది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములపై 2,750 తగ్గింది. దీంతో 67,700 నుంచి 64,950 ధరకు చేరుకుంది. 24 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములపై ఏకంగా 2,990 తగ్గింది. 73,850 నుంచి 70,860 ధరకు చేరుకుంది.

బంగారం ధర తులంపై 3,000 ధర తగ్గడం పసిడిప్రేమికులకు శుభవార్తే. ఇంకా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వెండి ధర చూస్తే హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా 3.500 తగ్గింది. దీంతో 99వేల నుంచి 88,000 ధరకు చేరుకుంది. ప్రస్తుతానికి బంగారం ధర మూడువేలు తగ్గినా.. రానున్న రోజుల్లో మరింత తగ్గుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. అసలే రాబోయేది పండుగలు, శుభకార్యాల సీజన్. భారతలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు పతనం కావడం పసిడి ప్రేమికులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..