Credit Card: క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే అప్పు తిరిగి చెల్లించాలా..? నిబంధనలు ఏంటో తెలిస్తే షాకవుతారు

బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య అధికంగా ఉండడంతో వారికి జీతం ఆధారంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు చెల్లింపులు అనేవి నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ కార్డుదారులు చెల్లిస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు చెల్లించాలనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా..? అయితే చాలా మంది క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ అప్పుడు అతని వారసులు చెల్లించాలని అనుకుంటూ ఉంటారు.

Credit Card: క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే అప్పు తిరిగి చెల్లించాలా..? నిబంధనలు ఏంటో తెలిస్తే షాకవుతారు
పండుగల సీజన్‌లో రివార్డ్ పాయింట్‌లను పొందడానికి ప్రజలు తరచుగా షాపింగ్‌కి వెళ్తుంటారు. ఇలా చేయడం మానుకోండి. దీని కారణంగా మీరు తరువాత అప్పుల భారం పడవచ్చు. ఎల్లప్పుడూ అవసరమైన వస్తువుల కోసం మాత్రమే షాపింగ్ చేయండి.
Follow us
Srinu

|

Updated on: Jul 24, 2024 | 5:00 PM

బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య అధికంగా ఉండడంతో వారికి జీతం ఆధారంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు చెల్లింపులు అనేవి నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ కార్డుదారులు చెల్లిస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు చెల్లించాలనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా..? అయితే చాలా మంది క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ అప్పుడు అతని వారసులు చెల్లించాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇందులో కొంత నిజం ఉన్నా నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డుపై ఉన్న అప్పుకు ఎవరికీ బాధ్యత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ బాధ ఆ కుటుంబాన్ని కోలుకోలేకుండా చేస్తుంది. అయితే ఆ సమయంలో అంతా సజావుగా ఉన్నా రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు అనేవి కుటుంబ సభ్యులను మరింత కుంగదీస్తాయి. అయితే నిబంధనల ప్రకారం ఈ అప్పులు సాధారణంగా మరణించిన వారి ఆస్తులను ఉపయోగించి పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. చట్టపరమైన వారసులు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, రుణ ఒప్పందాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులతో సహా అన్ని ఆర్థిక పత్రాలను సేకరించాలి. మరణించిన వ్యక్తికి తగినంత నిధులు ఉంటే ఏదైనా ఆస్తులను చట్టపరమైన వారసులకు పంపిణీ చేయడానికి ముందు ఈ అప్పులు వారు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మరణించిన వ్యక్తికి తగినంత నిధులు లేకపోతే రుణదాతలు పూర్తిగా చెల్లించాల్సిన మొత్తాలను తిరిగి పొందలేరు. అయితే కుటుంబ సభ్యులు సాధారణంగా రుణాల కోసం సహ సంతకం చేసినట్లయితే లేదా క్రెడిట్ కార్డ్‌లపై జాయింట్ అకౌంట్ హోల్డర్‌లైతే తప్ప ఈ అప్పులకు వ్యక్తిగతంగా బాధ్యత ఉండదు. సాధారణంగా మరణించిన వ్యక్తికి సంబంధించి వారసత్వ ఆస్తులను కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఆస్తులను పంచుకోవాలని అనుకునే వారు ఆ వ్యక్తి అప్పులను తీర్చి ఆస్తులను పంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. 

వారసుడి బాధ్యత పరిధి వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల పరిమాణానికి పరిమితమై ఉంటుంది. ఒకవేళ ఆస్తుల విలువ కంటే ఎక్కువ అప్పులు ఉంటే చెల్లింపు బాధ్యత అనేది ఆస్తుల విలువకు లోబడే ఉంటాయి. ఆయా నిబంధనలు వారసత్వ చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. హిందూ వారసత్వ చట్టం, 1955 షెడ్యూల్‌లో వారసుల తరగతులు సూచించారు. అయితే హిందూ స్త్రీకి, వారసులు, వారసత్వ రేఖ సెక్షన్ 15 ప్రకారం పేర్కొన్నారు. నామినేషన్ లేనప్పుడు మరణించిన కుటుంబ సభ్యుని పెట్టుబడులను క్లెయిమ్ చేయడానికి, అవసరమైన డాక్యుమెంట్‌లలో గుర్తింపు పత్రాలతో పాటు, విల్ కూడా, సర్వైవింగ్ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికార పరిధికి సంబంధించిన సంబంధిత సివిల్ కోర్టు నుంచి జారీ చేయబడిన వారసత్వ ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన వీలునామా ఆధారంగా టెస్టమెంటరీ వారసత్వం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ జిల్లాల్లో 100 శాతం సమగ్ర కులగణన సర్వే పూర్తి..
ఆ జిల్లాల్లో 100 శాతం సమగ్ర కులగణన సర్వే పూర్తి..
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది.?
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది.?
బంగారం ధర రూ.64 వేలకు పడిపోనుందా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
బంగారం ధర రూ.64 వేలకు పడిపోనుందా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు