Budget 2024: నిరుద్యోగంపై కేంద్రం సమరం.. కొత్త ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు

భారతదేశంలోని నిరుద్యోగంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ 2024-25లో కీలక చర్యలను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ 2024-25లో మూడు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. ఈ మూడు పథకాలు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో నమోదు చేసుకోవడంతో పాటు మొదటి సారి ఉద్యోగుల గుర్తింపుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు.

Budget 2024: నిరుద్యోగంపై కేంద్రం సమరం.. కొత్త ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
Unemployment
Follow us

|

Updated on: Jul 24, 2024 | 4:35 PM

భారతదేశంలోని నిరుద్యోగంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ 2024-25లో కీలక చర్యలను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ 2024-25లో మూడు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. ఈ మూడు పథకాలు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో నమోదు చేసుకోవడంతో పాటు మొదటి సారి ఉద్యోగుల గుర్తింపుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి బడ్జెట్ ప్యాకేజీ కింద ఐదు సంవత్సరాల వ్యవధిలో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీలలో సమగ్ర ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనకు సంబంధించిన కేంద్రం నిర్ణయాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు 

స్కీమ్-ఏ

ఈ పథకం అన్ని అధికారిక రంగాలలో మొదటిసారిగా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారందరికీ ఒక నెల వేతన చెల్లింపును అందిస్తుంది. ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసిన మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాలలో ఒక నెల జీతానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ రూ.15,000 వరకు ఉంటుంది. అర్హత పరిమితి నెలకు రూ. 1 లక్ష జీతం వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

స్కీమ్-బీ

ఈ పథకం మొదటి సారి ఉద్యోగులకు తయారీ రంగంలో అదనపు ఉపాధిని ప్రోత్సహిస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నాలుగు సంవత్సరాలలో ఈపీఎఫ్ఓకు సంబంధించి ఉద్యోగి, యజమానికి ప్రోత్సాహం అందిస్తారు. ఈ పథకం ద్వారా ఉపాధిలోకి ప్రవేశించే 30 లక్షల మంది యువతకు, వారి యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

స్కీమ్-సీ

ఈ స్కీమ్ సీ యజమాని కేంద్రీకృత పథకం అన్ని రంగాలలో అదనపు ఉపాధిని కవర్ చేస్తుంది. నెలకు రూ. 1 లక్ష జీతం పరిమితిలో ఉన్న అన్ని అదనపు ఉపాధి పథకం కింద లెక్కిస్తారు. ప్రతి అదనపు ఉద్యోగికి ఈపీఎఫ్ఓ ​​కంట్రిబ్యూషన్‌కు సంబంధించి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం యజమానులకు నెలకు రూ. 3,000 వరకు రీయింబర్స్ చేస్తుంది. ఈ పథకం 50 లక్షల మందికి అదనపు ఉపాధిని కల్పించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
సింగరేణి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి
సింగరేణి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అమృతా ప్రణయ్! సెంటిమెంట్ వర్క్ఔట్ అయ్యేనా?
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అమృతా ప్రణయ్! సెంటిమెంట్ వర్క్ఔట్ అయ్యేనా?
ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ బాదుడు.. కఠిన నిబంధనల అమలు
ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ బాదుడు.. కఠిన నిబంధనల అమలు
ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.?
ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.?
మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది?
మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది?
మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్..
మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్..
శివయ్య ఆరు పేర్లు అత్యంత ప్రత్యేకం ఆ పేర్లు ఏమిటి? అర్ధం ఏమిటంటే
శివయ్య ఆరు పేర్లు అత్యంత ప్రత్యేకం ఆ పేర్లు ఏమిటి? అర్ధం ఏమిటంటే
వేతన జీవులకు బడ్జెట్‌లో ఊరట.. ఆ విధానం ద్వారా రూ.17,500 ఆదా
వేతన జీవులకు బడ్జెట్‌లో ఊరట.. ఆ విధానం ద్వారా రూ.17,500 ఆదా