Telangana: ఈ జిల్లాలో పంతం నెగ్గిన మంత్రి.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. బీఆర్ఎస్‎లో తగ్గిన జోష్..

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో 10 కి కాంగ్రెస్ 8, సీపీఐ 1, బి ఆర్ ఎస్ 1 గెలుచుకున్నాయి. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‎కి దగ్గరగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ గూటికి చేయడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ‎కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

Telangana: ఈ జిల్లాలో పంతం నెగ్గిన మంత్రి.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. బీఆర్ఎస్‎లో తగ్గిన జోష్..
Telangana Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 07, 2024 | 7:36 PM

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో 10 కి కాంగ్రెస్ 8, సీపీఐ 1, బి ఆర్ ఎస్ 1 గెలుచుకున్నాయి. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‎కి దగ్గరగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ గూటికి చేయడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ‎కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఒక్క బిఆర్ఎస్ లీడర్‎ను అసెంబ్లీ గేట్ తాకనీయనని మంత్రి పొంగులేటి చేసిన శపథం నేర వేరింది. ఓటమి తర్వాత ముఖ్య నేతలు బయటకు రావడం లేదు. జిల్లాలో అసలు బిఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.

భద్రాచలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకటరావు విజయం సాధించారు. జిల్లాలో బిఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. వాస్తవానికి తెల్లం వెంకటరావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు. పొంగులేటితో పాటే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత భద్రాచలం టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకి ఇవ్వడంతో బిఆర్ఎస్‎లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. స్వల్ప మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు తెల్లం వెంకటరావు. పలితాలు తర్వాత కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా.. అప్పట్లో తెల్లం వెంకటరావు ఆ ప్రచారాన్ని ఖండించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్‎ను కలిశారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభోత్సవం, అదే రోజు మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో తెల్లం వెంకటరావు పాల్గొనడంతో ఆయన కాంగ్రెస్‎లో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. బిఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ సమావేశాలు, సభలకు హాజరవుతూ వచ్చారు. అయితే ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో మంత్రి పొంగులేటి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకున్నది సాధించారు అని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ కాక రేపాయి. రాష్ట్రంలోనే అధికార బిఆర్ఎస్‎లో ఉంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. కేసిఆర్‎తోపాటు ఇతర నేతలపై విమర్శలు సంధించారు పొంగులేటి. జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ కాక పుట్టించారు. తనకు బిఆర్ఎస్ చేసిన అవమానం, ఇబ్బందులు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళారు. బిఆర్ఎస్ ప్రభుత్వంను ఓడించి.. కెసిఆర్‎ను గద్దె దించడమే తన లక్ష్యం అని గట్టిగా సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి

క్రమ క్రమంగా రాష్ట్రంలో ఇతర అసంతృప్త నేతల్ని కలుపు కొని కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారు. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‎లు తమ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. చివరకు తన అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‎లో చేరారు పొంగులేటి. ఆ తర్వాత మరి కొందరు నేతలను కాంగ్రెస్‎లోకి తీసుకు వచ్చి.. కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్‎కు ఊపు తీసుకు వచ్చి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి.. పకడ్బందీ వ్యూహం, ప్రణాళికతో జిల్లాలో కాంగ్రెస్‎కు తిరుగులేని విజయానికి అందించారు. ఒక విధంగా గెలిచిన ఎమ్మెల్యేలకు వేలల్లో మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ఖమ్మం జిల్లా క్రియాశీల పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, రెవిన్యూ మంత్రిగా పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలకు పదవులు ఇచ్చి జిల్లాకు సముచిత ప్రాధాన్యత కల్పించారు.

బిఆర్ఎస్ ఓటమి తర్వాత ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేతలు,కేడర్ డీలా పడ్డారు. ఓటమి తరవాత మాజీలు ఒకరిద్దరు మినహా మిగిలిన నేతలు మొహం చాటేశారు. పార్టీ తరపున ఏదైనా కార్యక్రమాలు ఇచ్చినా చేసే వారు కరువయ్యారు. పట్టుమని పదిమందితో కూడా నిరసన కార్యక్రమాలు చేయలేని స్థితిలో పడ్డారు. కేడర్‎కు ధైర్యం చెప్పి.. అండగా ఉండే నేతలే లేరు. ఉన్న నేతల్లో కొందరు పార్టీ మారతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే జంప్ అయ్యారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. కేవలం వంద రోజుల్లోనే ఇలా అయ్యింది ఏంటని.. అధికారంలో ఉన్నపుడు కేడర్‎ను పట్టించుకోలేదని.. ఈ పరిస్థితికి నేతలే కారణం అని బిఆర్ఎస్ కార్యకర్తలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నేటితో ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్‎ను ఖాళీ చేసి తన శపథం నెగ్గించుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..