Telangana: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతలు సూపర్ ప్లాన్
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట. చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేసి నష్టం చేకూరుస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ప్రయోజనం ఉండటం లేదు. దీంతో అడవి పందులకు చెక్ పెట్టేందుకు వారే మాస్కర్ ప్లాన్ రూపొందించారు.
పంటలను నాశనం చేస్తున్న అడవి పందులపై వేట కుక్కలతో దాడి చేయించారు రైతులు.. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నాగపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. ఎన్నో కష్టనష్టాలను భరించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేసి పంటలు నాశనం అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయమంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొందని అందుకే వేట కుక్కలతో ఇలా అడవి పందుల నివారణ చేస్తున్నామని అన్నారు. తాజాగా అడవి పందిని వేట కుక్కలతో వెంటాడి చంపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవతుంది.
ముఖ్యంగా మొక్కజొన్న, వరి, జొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడు, పండ్ల తోటలపై అడవి పందుల దాడి ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పత్తులను తినడంతోపాటు వాటి సంచారంతో పంట నాశనం అవుతుందని. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళ గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తుంటాయని రైతులు చెప్పారు. ఏది ఎమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పంట పొలాల్లో అడవి జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ ట్రిక్ బాగా పని చేసిందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…