AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu 2025: భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి.. ఈఏడాది జాతర అదిరిపోవాలంటున్న మంత్రి కొండా సురేఖ

తెలుగింటి ఆడబడుచులు జరుపుకునే ఘనమైన పండగ బోనాలు పండగ. ఆషాడం మాసం వస్తుందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించే పండగ. గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యే ఈ వేడుకలు ఆషాడం మాసంలోని ఆదివారం అంగరంరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది.

Bonalu 2025: భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి.. ఈఏడాది జాతర అదిరిపోవాలంటున్న మంత్రి కొండా సురేఖ
Bonalu 2025
Surya Kala
| Edited By: |

Updated on: Jul 09, 2025 | 7:03 PM

Share

మరికొన్ని రోజుల్లో ఆషాడ మాసం రానుంది. ఈ నేపద్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలూ బోనాల జాతరను జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుంది. అయితే మొదటి రోజే గురువారం రావడంతో జూన్ 26వ తేదీ నుంచే బోనాల సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్ల గురించి రివ్యూ మీటింగులో మంత్రి కొండా సురేఖ పలు సూచనలు చేశారు. జంట నగరాల్లోని మొత్తం 28 టెంపుల్స్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రావొద్దని.. బోనాల పండగను జరపడం కోసం ఎక్కడ లోటు లేకుండా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని.. ప్రభుత్వం నుంచి ఇప్పటికే రూ 20 కోట్ల మంజూరు చేశామని చెప్పారు. ఒకవేళ బోనాల ఏర్పాట్లకు ఈ డబ్బులు సరిపోలేదు ఇంకా కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్నీ తీసుకెళ్దామని.. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు ఎక్కడా రానివ్వకుండా ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు సూచించారు. గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారికే ఇబ్బంది వచ్చింది. ఈసారి అలాంటి సన్నివేశం మళ్ళీ రిపీట్ కావోద్దని అధికారులకి సూచిస్తున్నా అని అన్నారు మంత్రి కొండా సురేఖ.

ఆషాఢ మాస బోనాలు సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని.. గతంలో ఏర్పాట్లు చేసే సమయంలో జరిగిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. మళ్ళీ జరగకుండా ఈ ఏడాది ముందస్తుగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలని సూచించారు.

గోల్కొండ లో ఈ నెల 26 తోలి బోనం..

ఇవి కూడా చదవండి

జూన్ 26న ఆషాడం మాసం ప్రారంభం కానుంది. ఈ రోజు గురువారం కనుక తొలి బోనం గోల్కొండ లోని అమ్మవారికి సమర్పించడంతో బోనాల సంబురాలు ప్రారంభం అవుతాయి. తర్వాత వరసగా బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. ఈ సంబురాల్లో రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది. కనుక దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ అండ్ ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండగ లకు ముందే పనులను పూర్తి చేయాలని.. ఈ బోనాల సందర్భంలో విధులను నిర్వహించే అధికారులు.. ఉద్యోగంలా భావించకుండా.. ఒక సేవ చేస్తున్నామని భావించాలని చెప్పారు. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు దైవ చింతనతో జరగాలని అన్నారు. అదే విధంగా బోనాల జాతరలో విధులను నిర్వహించే పోలీస్ సిబ్బంది.. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద ఈ బోనాల జాతరలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని.. కనుక ఎటువంటి తలెత్తకుండా.. ఏర్పాట్లలో ఎక్కడ లోపం లేకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు మంత్రి కొండా సురేఖ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..