Warangal: అర్ధరాత్రి పోలీస్ వీరంగం.. బైక్ ఆపలేదనీ చెంప చెళ్లుమనించిన SI బాబు! రాత్రంతా కుటుంబం అడవిపాలు
చిమ్మ చీకట్లో కుటుంబంతోపాటు వెళ్తున్న బైకును ఓ పోలీస్ అధికారి ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు వ్యక్తి భయపడి బైక్ ఆపకుండానే వెళ్లిపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు పోలీస్ ఆ కుంటుంబానికి నరకం చూపించాడు. రాత్రంతా అడవిలోనే పిల్లలు భార్యతో బాధితుడిని..

వరంగల్, జూన్ 10: అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కుటుంబంతోపాటు వెళ్తున్న బైకును ఓ పోలీస్ అధికారి ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు వ్యక్తి భయపడి బైక్ ఆపకుండానే వెళ్లిపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు పోలీస్ ఆ కుంటుంబానికి నరకం చూపించాడు. రాత్రంతా అడవిలోనే పిల్లలు భార్యతో బాధితుడిని ఉంచాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం (జూన్ 9) వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
వర్ధన్నపేటలోని రామవరం గ్రామానికి చెందిన బాలకృష్ణ భార్యా, ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంపై సోమవారం (జూన్ 9) రాత్రి వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామశివారులో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇంతలో SI చందర్ దంపతుల వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే బాలకృష్ణ అపకుండా ముందుకు వెళ్లాడు. ఆపమన్న వెంటనే బైక్ ఆపలేదని శివమెత్తిన SI చందర్ రాత్రంతా ఆ కుటుంబాన్ని అడవిపాలు చేశాడు. బార్య పిల్లల ముందే అతని చెంప చెళ్లుమనిపించిన SI, ఆయన వాహనం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని చిమ్మచీకట్లో నడిరోడ్డుపై వదిలేశాడు.
దీంతో ఆ కుటుంబం రాత్రంతా బోరున విలపిస్తు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైనే కూర్చున్నారు. బండి ఆపలేదని తన భర్తను అకారణంగా కొట్టి, బండి తీసుకెళ్లిన SI పై చర్యలు తీసుకోవాలని బాధితుడి బార్య, పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. రక్షణ కల్పించవల్సిన పోలీసులే ఇలా సామాన్యులపై కక్ష్య సాధింపులు చేయడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.