Deadly Bioweapon: హెచ్చరిక.. కరోనాను మించిన మరో మహమ్మరికి పురుడుపోస్తున్న చైనా!
కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే, మరో భయంకరమైన ఫంగస్ పుట్టిందా? అది ప్రపంచాన్ని చుట్టేయబోతోందా? మరో మహమ్మారిగా మారబోతోందా? అమెరికాలో స్థిరపడిన చైనాకు చెందిన గోర్డాన్ చాంగ్ అనే నిపుణుడు దండోరా కొట్టిమరీ ఈ విషయం చెబుతున్నారు. ఈసారి చైనా కుట్ర ఏకంగా వ్యవసాయంపైకి మళ్లించింది..

చైనా ఆగ్రో టెర్రరిజానికి పాల్పడుతోందని గతవారం అమెరికా FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ చేసిన సంచలన ప్రకటన కలకలం రేపింది. చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులను అమెరికాలో అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర బయటపడిందని కశ్యప్ పటేల్ చెప్పారు. అయితే, డ్రాగన్ కంట్రీ విషయంలో ఇక్కడితో ఆగిపోవద్దని గోర్డాన్ చాంగ్ చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడిన ఈయన ఒక లాయర్. రాజకీయ విశ్లేషకుడు.
డ్రాగన్ కంట్రీ నుంచి వస్తున్న డేంజర్ సిగ్నల్‌ను అగ్రరాజ్యం ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని గోర్డాన్ చాంగ్- ఒక అమెరికా టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో చైనా ఫంగస్ ఎంత డేంజర్ అన్న చర్చ మళ్లీ మొదలైంది. చైనా ఫంగస్‌పై అమెరికా అనలిస్ట్ గోర్డాన్ చాంగ్ హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా.. కరోనాను మించిన మహమ్మరి రావడం ఖాయం అని గోర్డాన్ చాంగ్ అన్నారు. ఫుసేరియమ్ గ్రామినీరమ్ ఫంగస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన అన్నారు. చైనా ఆగ్రో టెర్రరిజమ్‌ను అరికట్టాలంటే.. ఆ దేశంతో అమెరికా సంబంధాలు తెంచుకోవాలి చాంగ్ పిలుపునిచ్చారు. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని చాంగ్ హెచ్చరించారు.
తక్షణ జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 మహమ్మారి కంటే తీవ్రమైన సంక్షోభాన్ని దేశం ఎదుర్కోవలసి వస్తుందని సూచిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ చైనా విశ్లేషకుడు హెచ్చరిక జారీ చేశారు. ఇద్దరు చైనా జాతీయులు యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రమాదకరమైన ఫంగస్‌ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జున్యోంగ్ లియు (34), అతని పార్ట్‌నర్ యుంకింగ్ జియాన్ (33) అక్రమంగా అమెరికాకు డేంజరస్ ఫంగస్ తరలిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటలను ప్రభావితం చేసే వినాశకరమైన ఫంగస్. ఇది ‘హెడ్ బ్లైట్’ కు కారణమయ్యే ఫంగల్ వ్యాధికారకమైన ఫ్యూసేరియం గ్రామినారమ్. ఈ ఫంగస్ సంభావ్య వ్యవసాయ ఉగ్రవాద ఏజెంట్‌గా గుర్తించారు. ఇది ఏటా బిలియన్ల వ్యవసాయ నష్టాలకు కారణమవుతుందని US న్యాయ శాఖ గుర్తించింది. ఇది మానవులకు, జంతువులకు ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తుందని అన్నారు. వాంతులు, కాలేయం దెబ్బతినడం, పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే లక్షణాలను కలిగిస్తుంది. ఫంగస్ స్మగ్లర్లు గతంలో చైనాలో ఫంగస్‌ను అధ్యయనం చేశారని, బయోసెక్యూరిటీ ఉల్లంఘనల గురించి హెచ్చరికలు లేవనెత్తాయని పరిశోధకులు వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.