Viral Video: విమానం ఎక్కుతూ తూలిన ట్రంప్ అంకుల్.. బైడెన్‌ను గుర్తుచేస్తూ నెట్టింట పేలుతున్న జోకులు!
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు అనేకసార్లు జారిపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఎగతాళి చేశారు. అయితే తాజాగా ట్రంప్ కూడా బైడెన్ మాదిరి విమానం మెట్లు ఎక్కుతూ తూలి పడబోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

వాషింగ్టన్, జూన్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతూ తుళ్లిపడబోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను గుర్తుచేసుకుంటూ జోకులు పేలుస్తున్నారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్‌లోని మోరిస్టౌన్ మున్సిపల్ విమానాశ్రయం నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతున్నారు. అయితే సగం దూరం మామూలుగానే ఎక్కిన ట్రంప్ మధ్యలో మెట్లపై పొరపాటున తూలి పడబోయారు. ట్రంప్ తర్వాత అదే విమానం ఎక్కెందుకు వచ్చిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో సైతం తూలిపడటం విశేషం.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. గతంలో బైడెన్ విమానం ఎక్కుతూ తూలిపడటంతో ఆయన కనీసం విమానం కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ట్రంప్ ఎడాపెడా తెగ ఎగతాళి చేశారు. నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు వరుస పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. కాగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు అనేకసార్లు జారిపడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2024లో జరిగిన ఓ సంఘటనలో బైడెన్ లాస్ ఏంజిల్స్‌కు వెళ్లడానికి విమానం ఎక్కుతూ రెండుసార్లు జారిపడ్డాడు. మేరీల్యాండ్‌లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోని మెట్ల బేస్ వద్ద బైడెన్ ఇలా తుళ్లిపడ్డారు. అయితే బైడెన్ మెట్లు ఎక్కుతూ మధ్యలో జారిపడినప్పటికీ తనను తాను స్థిరపరచుకోవడానికి రెయిలింగ్‌ను పట్టుకున్నారు. అనంతరం తదుపరి మెట్టుపై కాలు పెట్డబోయి మళ్ళీ జారిపడి ఎలాగో విమానంలోకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో పలుమార్లు షేర్ చేసి నానాహంగామా చేశారు. బైడెన్‌కు వృద్ధాప్య సమస్యలు ఉన్నాయని, జ్ఞాపకశక్తి క్షీణించిందని ఎగతాళి చేశారు.
President Trump stumbles while walking up the stairs to Air Force One pic.twitter.com/Z9ZNEKkd7z
— Acyn (@Acyn) June 8, 2025
ఇక ఫిబ్రవరి 2023లో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు ఐరోపా గుండా మూడు రోజుల పర్యటన తర్వాత బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కుతున్నప్పుడు కూడా ఇలాగే జారిపడ్డాడు. ఈ సంఘటన పోలాండ్‌లోని వార్సాలోని చోపిన్ విమానాశ్రయంలో జరిగింది. ట్రంప్ స్థానంలో బైడెన్ ఉండివుంటే ఇప్పటికే అన్ని టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చేదని ఎద్దేవా చేస్తున్నారు.
🚨BREAKING: President Trump briefly stumbles while climbing the steps to Air Force One—quickly regains footing and boards without issue. pic.twitter.com/7aNijzMDwv
— Juan Torres (@juanpodcast1) June 8, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.